Amaravati : విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని విషయమై ఇంకా గందరగోళం కొనసా..గుతూనే ఉంది. గత ప్రభుత్వం ఏపీకి అమరావతి రాజధాని అని పేర్కొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. కాగా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధాని కాదని మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. కాగా, ఇటీవల మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంది. త్వరలో మళ్లీ రాజధానుల విషయమై స్పష్టమైన ప్రణాళికతో ముందుకొస్తామని జగన్ సర్కారు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ ‘అమరావతి’ పేరిట పొలిటికల్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి.
అమరావతిని రాజధాని చేయడం కోసం చంద్రబాబు సర్కారు తీసుకొచ్చిన సీఆర్ డీఏను జగన్ సర్కారు పట్టించుకోలేదు. తాజగా రాజధానిలోని కొన్ని గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు డిసైడ్ చేసింది. ఇందుకుగాను రాజధానిలోని 19 గ్రామాలను కార్పొరేషన్ చేయాలని డెసిషన్ తీసుకుంది.
అయితే, సీఆర్ డీఏ చట్టంలో మాత్రం 29 రెవెన్యూ గ్రామాలను రాజధాని ప్రాంతం అనగా క్యాపిటల్ రీజియని అని వివరించారు. తాజాగా జగన్ ప్రభుత్వం 19 గ్రామాలతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందట. మరి మరో పది గ్రామాలు ఏమయ్యాయి అనే ప్రశ్న ఎదురవుతున్నది. కాగా, వాటిని విడిగా మరో కార్పొరేషన్‌లో కలుపుతున్నారు. అలా మొత్తంగా రాజధాని రెవెన్యూ గ్రామాలను ఇలా చేస్తున్నారు.
గతేడాది మార్చి నెలలోనే మంగళగిరి-తాడేపల్లి మున్సిపాల్టీల తోపాటు మరో 21 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, కొందరు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మున్సిపాలిటీకి అప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. ఐదు లక్షల జనాభా దాటి న తర్వాత మున్సిపల్ ప్రాంతాన్ని కార్పొ రేషన్‌గా ఏర్పాటు చేస్తారు.
పలు టెక్నికల్ విషయాలు ఉన్నప్పటికీ జగన్ సర్కారు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే మాస్టర్ ప్లాన్ మార్చొద్దని హైకోర్టు పదే పదే చెబుతున్నా పట్టించుకోవడం లేదు. సర్కారు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నదని రైతులు, న్యాయనిపుణులు అంటున్నారు. మొత్తంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని ఇంకా రాజకీయం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైందా ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Ram Gopal Varma : నీకు నీ డ్రైవర్‌కు తేడా లేదా? మంత్రి పేర్ని నానిపై ఆర్జీవీ సెటైర్..