Vivo Y39 5G Launch
Vivo Y39 5G Launch : Vivo మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Vivo Y39 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ Vivo ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల HD+LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. వివో Y39 5Gలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 6,500mAh బ్యాటరీతో వస్తుంది. వివో Y39 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Vivo Y39 5G ధర ఎంతంటే? :
ధర విషయానికి వస్తే.. వివో Y39 5G ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999, 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999కు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ లోటస్ పర్పుల్, ఓషన్ బ్లూ కలర్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్‌లలో కూడా లభ్యమవుతుంది. లాంచ్ ఆఫర్ కింద ఏప్రిల్ 6, 2025 వరకు రూ.1,500 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది.
Vivo Y39 5G స్పెసిఫికేషన్లు :
వివో Y39 5G ఫోన్ 1608×720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్, 83శాతం NTSC కలర్ గామట్‌తో 6.68-అంగుళాల HD+LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే SCHOTT Xensation(α)గ్లాస్ ప్రొటెక్షన్‌తో అమర్చి ఉంది. ఈ ఫోన్ అడ్రినో 613 GPUతో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 Gen2 4nm మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ 8GB LPDDR4x ర్యామ్‌తో 128GB/256GB (UFS 2.2) స్టోరేజ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది. సెక్యూరిటీ కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ 6,500mAh బ్యాటరీతో అమర్చి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వివో Y39 5G బ్యాక్ సైడ్ f/1.8 ఎపర్చర్‌తో 50MP ఫస్ట్ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2MP పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ f/2.0 ఎపర్చర్‌తో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. కొలతలను చూస్తే.. వివో ఫోన్ పొడవు 165.70 మిమీ, వెడల్పు 76 మిమీ, మందం 8.28 మిమీ (లోటస్ పర్పుల్), 8.37 మిమీ (ఓషన్ బ్లూ), బరువు 207 గ్రాములు (ఓషన్ బ్లూ), 205 గ్రాములు (లోటస్ పర్పుల్) ఉన్నాయి.
ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ (MIL- STD-810H) డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ సిమ్, USB టైప్-C పోర్ట్, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS ఉన్నాయి.