Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

PM Kisan Yojana : రైతులకు భారీ గుడ్ న్యూస్, పీఎం కిసాన్ 22వ విడత రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?

PM Kisan Yojana 22nd Installment : పీఎం కిసాన్ 22వ విడత డబ్బుల కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

By Ramesh Babu

Published on: February 17, 2026 9:01 AM

Updated on: February 17, 2026 8:26 AM

PM Kisan Yojana 22nd Installment

---Advertisement---

PM Kisan Yojana 22nd Installment : దేశవ్యాప్తంగా రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద అర్హత పొందిన భూమి ఉంటే రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని రూ. 2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది.

పీఎం కిసాన్ పథకం కింద అందుకున్న ఈ మొత్తం రైతులు తమ వ్యవసాయ సంబంధిత అవసరాలను తీర్చుకోవచ్చు. 22వ విడత (PM Kisan 22nd Installment) విడుదలకు ముందు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు.

Advertisement

అనేక నివేదికల ప్రకారం రాబోయే విడత రూ. 2,000 ఫిబ్రవరి, మార్చి 2026 మధ్య లబ్ధిదారుల అకౌంట్లలో బదిలీ అవుతుంది. ఈ పథకం 21వ విడత నవంబర్ 19, 2025న విడుదల అయింది.

ఎవరు అర్హులు? :

  • సాగు భూమి ఉన్న అన్ని చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.
  • రైతుల పేరు మీద పొలం రికార్డు ఉండటం తప్పనిసరి.
  • రైతుకు వ్యాలీడ్ అయ్యే ఆధార్ కార్డు ఉండాలి. కేవైసీ పూర్తి అయి ఉండాలి.

పీఎం కిసాన్ KYC అవసరమా? : (PM Kisan Yojana 22nd Installment )

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని రిజిస్టర్డ్ రైతులు KYC (నో యువర్ కస్టమర్) వెరిఫికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. పథకం ప్రయోజనాలు సరైన, నిజమైన లబ్ధిదారులకు చేరేలా ఎలాంటి దుర్వినియోగం లేదా మోసాలు జరగకుండా ఉండేలా ప్రభుత్వ ప్రక్రియ చేపట్టింది. కేవైసీ పూర్తి చేయని రైతులు తమ వాయిదాలలో ఆలస్యం జరగవచ్చు లేదంటే వారి చెల్లింపు కూడా నిలిచిపోవచ్చు.

KYC ఎలా పూర్తి చేయాలి? : (PM Kisan Yojana)

  • రైతులు PM-KISAN అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేసి ఆన్‌లైన్‌లో KYC పూర్తి చేయవచ్చు.
  • ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. అది ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ పూర్తవుతుంది
  • KYC సక్సెస్ ఫుల్ అని మెసేజ్ వస్తుంది
  • OTP ద్వారా ఆన్‌లైన్‌లో KYC పూర్తి చేయలేని రైతులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లి బయోమెట్రిక్ మెథడ్ ద్వారా KYC పూర్తి చేసుకోవచ్చు.

22వ వాయిదా స్టేటస్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి? :

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (www.pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
  • ‘Farmers Corner‘ పై క్లిక్ చేసి, ‘Beneficiary Status’ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయండి.
  • ఈ పోర్టల్ ద్వారా మీ వాయిదాల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
  • వచ్చిన వాయిదాలు, పెండింగ్ వాయిదాలు, చివరి పేమెంట్ డేట్ ఉంటాయి.
  • రైతులు 22వ విడత డబ్బులు పొందాలంటే KYC వంటి ముఖ్యమైన పనులు వెంటనే పూర్తి చేయాలి.

Advertisement

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.