PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ రైతులు 22వ విడత కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21 వాయిదాలను అందుకున్న రైతులు మరోసారి రూ. 2వేలు అందుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే రైతుల్లో ఒకటే ప్రశ్న వ్యక్తమవుతోంది. ఈసారి 22 వ విడత వాయిదా డబ్బులు ఫిబ్రవరిలో ఏ తారీఖున వస్తాయా? లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి 15కి ముందే రూ. 2వేలు? :
కోట్లాది మంది రైతులు ఫిబ్రవరి 15కి ముందు కేంద్ర ప్రభుత్వం (PM Kisan 22nd Installment) పీఎం కిసాన్ 22వ విడతను విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో రైతుల ఖాతాలకు 21వ విడతను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు, ఫిబ్రవరి నెలలో 22వ విడత విడుదల చేయాల్సి ఉంది.
అయితే ఇప్పటివరకూ ఏ తేదీ అనేది ఖరారు చేయలేదు. అయితే, 22వ విడత విడుదల తేదీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. అయితే, ఫిబ్రవరిలో రూ. 2వేలు రైతుల ఖాతాల్లో పడతాయని మీడియా నివేదికలు అంచనా వేస్తున్నాయి.
PM Kisan 22nd Installment : ఏడాదికి రూ. 6వేలు ఆర్థిక సాయం :
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తం ప్రతి సంవత్సరం 3 సమాన వాయిదాలలో లబ్ధిదారు రైతు బ్యాంకు అకౌంట్లలో నేరుగా డిపాజిట్ అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం పండుగలు లేదా ప్రధాన కార్యక్రమాల సమయాల్లోనే ఎక్కువగా పీఎం కిసాన్ వాయిదాలను విడుదల చేస్తుంది. ఇప్పటివరకూ మొత్తం 21 వాయిదాలు విడుదల అయ్యాయి. పీఎం నరేంద్ర మోదీ పీఎం కిసాన్ విడత వాయిదాను విడుదల చేస్తుంటారు.
అయితే, పీఎం కిసాన్ 22వ విడత విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అంతేకాదు.. ఫిబ్రవరి 15కి ముందు లేదా ఆ తర్వాత ఈ పీఎం కిసాన్ విడత విడుదల అవుతుందా? లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. మీడియా నివేదికల్లో కేవలం ఊహాగానాలు మాత్రమే.. రైతులు ఇలాంటి పుకార్లపై ఆధారపడకుండా అధికారిక సమాచారం కోసం వేచి ఉండాల్సిందే..
ఇ-కేవైసీ, ఆధార్ లింక్ తప్పనిసరి :
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం e-KYC, ఆధార్ లింక్‌ను తప్పనిసరి చేసింది. అందుకే ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే లబ్ధిదారు రైతులు ఇ-కేవైసీ, ఆధార్ లింక్ అనే ఈ రెండు ముఖ్యమైన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.
ప్రధానమంత్రి కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్, ప్రభుత్వ నోటిఫికేషన్‌లను రైతులు తప్పనిసరిగా చెక్ చేస్తుండాలి. అనధికారిక మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ లేదా సోషల్ మీడియా పోస్ట్‌లను నమ్మొద్దు. పీఎం కిసాన్ 22వ విడత విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తే ఆ సమాచారం ముందుగా అధికారిక వెబ్ సైట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి.













