PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

PM Kisan 22nd installment : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది రైతులకు ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వ కీలకమైన పథకం. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 మొత్తం ఆర్థిక సాయం పొందవచ్చు.

  • ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 
  • రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సాయం
  • రూ. 2వేలు చొప్పున 3 సమాన వాయిదాలలో పొందొచ్చు
  • రైతులు వీలైనంత త్వరగా e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి

PM Kisan 22nd installment : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan) 22వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మీరు ఇంకా e-KYC ప్రాసెస్ పూర్తి చేయలేదా? అలా చేయకపోతే మీ డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంది.

వాస్తవానికి, మీడియా నివేదికల ప్రకారం.. రైతులు వీలైనంత త్వరగా e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ పథకం కింద ప్రతి ఏటా రూ. 6,000 పొందవచ్చు. రైతులు తప్పనిసరిగా వ్యాలీడ్ రైతు ఐడీని కలిగి ఉండాలి. ఇది ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

పీఎం కిసాన్ e-KYC ప్రాసెస్ ఏంటి? :
ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా లబ్ది పొందే రైతులు ఈ-కెవైసిని 3 పద్ధతుల ద్వారా పూర్తి చేయవచ్చు. ఓటీపీ ఆధారిత ధృవీకరణ, ఫేస్ అథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు. ఈ-కెవైసీని పూర్తి చేయని రైతులకు రావాల్సిన వాయిదా ఆలస్యం కావచ్చు లేదా నిలిపివేయవచ్చు.

Advertisement

Read Also : Shoe Polish : ఇంట్లోనే బొగ్గుతో మార్కెట్ లాంటి షూ పాలిష్.. మీ బూట్లు రోజంతా కొత్తగా మెరుస్తూనే ఉంటాయి.. ఇలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు!

OTP ఆధారిత e-KYC కోసం రైతులు వారి ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి. ఇందుకోసం అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ ( https://pmkisan.gov.in/)ని విజిట్ చేయండి. ఆ తర్వాత e-KYC ఆప్షన్ కు వెళ్లి మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీరు ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ఉపయోగించి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

PM Kisan 22nd installment : ఇప్పుడు రైతు ఐడీ కూడా తప్పనిసరి :

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు e-KYCతో పాటు రైతు ఐడీ ఉండటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రైతు ఐడీని వారి పీఎం కిసాన్ ఖాతాకు లింక్ చేయని రైతుల తదుపరి వాయిదాను నిలిచిపోతుంది. నివేదికల ప్రకారం.. రాబోయే విడతకు ముందే ఈ షరతును కచ్చితంగా అమలు చేసే అవకాశం ఉంది.

Advertisement

రైతులు వీలైనంత త్వరగా తమ పీఎం కిసాన్ అకౌంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. e-KYC పూర్తయిందని బ్యాంక్ అకౌంట్ సరిగ్గా ఉందని, రైతు ఐడీ వ్యాలీడ్ గా ఉందని నిర్ధారించుకోవాలి. అసంపూర్ణ సమాచారంతో ఆలస్యం కావచ్చు లేదా రాబోయే వాయిదా కూడా ఆగిపోవచ్చు.

పీఎం కిసాన్ యోజన అంటే ఏంటి? :

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది రైతులకు ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకం. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలు సంవత్సరానికి మొత్తం రూ. 6,000 ఆర్థిక సాయం అందుకుంటారు.

ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో బదిలీ అవుతాయి. ఈ పథకం డిసెంబర్ 1, 2018న ప్రారంభమైంది. దీని మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని లబ్ధిదారులను గుర్తిస్తాయి.

Advertisement

పీఎం కిసాన్ 22వ వాయిదా ఎప్పుడు వస్తుంది? :
పీఎం కిసాన్ 22వ విడత రూ.2,000 కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, కేంద్రం ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడు అనేది తేదీని ప్రకటించలేదు. సాధారణంగా, ఈ రూ. 2వేలు ప్రతి నాలుగు నెలలకు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. మీడియా నివేదికల ప్రకారం.. వచ్చే విడత ఫిబ్రవరిలో రావచ్చు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel