
SBI Prelims Result 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త్వరలో జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ పరీక్ష, 2025 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు తమ ఫలితాలను (sbi.co.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ నియామక ప్రక్రియ ద్వారా SBI మొత్తం 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్ 10, 2025న నిర్వహించే మెయిన్ పరీక్షకు హాజరు కావాలి.
ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 22, 27, 28, మార్చి 1, 2025 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో జరిగింది. జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ పరీక్ష, 2025 ఫలితాలు విడుదలైన తర్వాత స్కోరు కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
SBI రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? :
- SBI అధికారిక వెబ్‌సైట్ (sbi.co.in)ని విజిట్ చేయండి.
- ‘Careers’ లింక్‌పై క్లిక్ చేయండి.
- Results లింక్‌పై క్లిక్ చేయండి
- మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి
- మీ రిజల్ట్స్ మీ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.
- రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం వెంటనే సేవ్ చేయండి.
Read Also : UPI Outage : భారత్‌లో స్తంభించిన యూపీఐ సర్వీసులు.. ఆగిపోయిన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్..!