Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఫిబ్రవరి 15, 2025 (శనివారం) ఒక్కసారిగా తగ్గాయి. ఏకంగా తులం బంగారం ధర రూ. 1,090 బంగారం తగ్గింది. ఈరోజు బంగారం ధర విషయానికి వస్తే.. 10 గ్రాముల తులం బంగారం ధర రూ.78,900 పలుకుతోంది. నిన్న బంగారం ధర రూ. 79,900గా ఉంది. బంగారం వెయ్యి తగ్గింది.
బంగారం ధరలో హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది. అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ బంగారం పెరుగుదల ఇలాగే కొనసాగితే త్వరలో బంగారం ధర రూ. 90వేల మార్కును దాటుతుంది. బలహీనమైన డాలర్ ఇండెక్స్, యూఎస్ టారిఫ్ విధానాల మద్దతు కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక దృక్పథంలో అనిశ్చితి మధ్య, సురక్షితమైన ఆస్తిగా బంగారంలో పెట్టుబడి పెరుగుతోంది.
ఈ క్రమంలోనే బంగారం ధరలు బలపడుతున్నాయి. తాజా ధరల గురించి మాట్లాడుకుంటే.. ఫిబ్రవరి 15వ తేదీ శనివారం కూడా బంగారం ధర కాస్తా తగ్గుముఖం పట్టింది. రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.87320కి చేరుకుంది. దేశంలోని 10 పెద్ద నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rates Today : ఢిల్లీలో బంగారం ధరలివే :
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 86,220 రూపాయలు. 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 79,050 ధర పలుకుతోంది. ప్రస్తుతం ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.86070గా ఉంది. చెన్నై, కోల్‌కతాలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే? :
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.86,070గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
వెండి రేటు ఎంతంటే? :
ఫిబ్రవరి 15న వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1,00,500 వద్ద ఉంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో శుక్రవారం వెండి ధర రూ.2,000 పెరిగి 4 నెలల గరిష్ట స్థాయి కిలోకు రూ.1 లక్షకు చేరుకుంది. ఆసియా వాణిజ్యంలో కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు 4 శాతం పెరిగి ఔన్సుకు 34 డాలర్లకు చేరుకుంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1,08,000 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా వెండి ధరలు రూ. 1,08,000 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.