Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కొద్దిరోజులుగా ఇదే కొనసాగుతోంది. మొన్న పెరిగిన తులం బంగారం ధర ఈరోజు మాత్రం భారీగా తగ్గిపోయింది. గ్లోబల్ మార్కెట్లలో కూడా బంగారం ధరలు పడిపోయాయి. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ వస్తోంది. ఈ సీజన్‌లోనే బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.
వివాహాది కార్యక్రమాల కోసం బంగారం కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు. పెళ్లి సీజన్ మొదలు కాకముందే బంగారం కొనేసుకోండి. లేదంటే సీజన్ మొదలైతే మళ్లీ బంగారం ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా తెలంగాణలోని హైదరాబాద్ సహా ఢిల్లీ, విజయవాడలో ఈరోజు (ఫిబ్రవరి 10న) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో బంగారం ఎంత తగ్గిందంటే? :
నగరంలో బంగారం ధర తగ్గింది. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ.100 తగ్గింది. దాంతో రూ. 57,900కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ.70 తగ్గింది. దాంతో రూ. 63,160కు తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 తగ్గింది. ఫలితంగా రూ. 58,50కు చేరింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.20 తగ్గింది. దాంతో రూ.63, 310 ధర పలుకుతోంది.

విజయవాడలో బంగారం ధర ఎంతంటే? :
తెలుగు రాష్ట్రమైన ఏపీలోని విజయవాడలో ఈరోజు బంగారం 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 57,890గా ఉంది. నిన్నటి ధర 57,900 నుంచి రూ. 10 తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.63,150కు తగ్గింది. నిన్నటి ధర రూ.63,160 నుంచి రూ.10 తగ్గింది.
వెండి ధర ఎంత పెరిగిందంటే? :
హైదరాబాద్ నగర మార్కెట్లో వెండి ధరలు మళ్లీ పెరిగాయి. కిలో వెండి ధర రూ.500 పెరిగింది. దాంతో వెండి ధర రూ. 76,500కి చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.500 పెరిగింది. దాంతో రూ. 75,000 మార్క్ చేరుకుంది. బంగారం, వెండి ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయని గమనించాలి. విజయవాడలో కిలో వెండి ధర రూ. 100 పెరిగి రూ.76,600కు చేరింది.
Read Also : Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…