Spinach : ఆకుకూరలు ఆరోగ్యానికి చాలామంచిదని వైద్యులు చెబుతారు. మన ఆహారంలో అనేక రకాల ఆకుకూరలను చేర్చుకుంటాం. అందులో పాలకూర (Spinach Health Benefits) కూడా ఒకటి. పాలకూర ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. మనం పాలకూరను అనేక విధాలుగా వాడుతుంటాం. కూర లేదా పరాఠాలో ఎక్కువ వాడతారు. అసలు పాలకూర ఎందుకు తినాలి? కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర 7 ఆరోగ్య ప్రయోజనాలివే (Spinach Health Benefits) :
ఇనుము :
పాలకూర రక్తంలో ఆక్సిజన్ రవాణాకు సాయపడే మొక్కల ఇనుము పుష్కలంగా దొరకుతుంది. శాఖాహారులు తమ ఆహారంలో ఎక్కువ మొత్తంలో పాలకూరను తీసుకోవాలి.
షుగర్ కంట్రోల్ చేస్తుంది :
పాలకూర గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సాయపడుతుంది. పాలకూర అనేది డయాబెటిస్ రోగులకు సూపర్ ఫుడ్‌గా చెప్పవచ్చు.
రక్తపోటును తగ్గిస్తుంది :
మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే.. మీ ఆహారంలో పాలకూరను కచ్చితంగా చేర్చుకోండి. పాలకూరలో అధిక పొటాషియం ఉంటుంది. శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.
కళ్ళకు మేలు చేస్తుంది :
పాలకూరలో లభించే కెరోటినాయిడ్లు సూర్యకాంతి వల్ల కలిగే నష్టం నుంచి కళ్ళను రక్షించడంలో సాయపడతాయి.
ఎముకల ఆరోగ్యానికి మంచిది :
పాలకూరలో కాల్షియం, విటమిన్ K, మెగ్నీషియం ఉంటాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Read Also : Vivo Y39 5G : గుడ్ న్యూస్.. కొత్త వివో 5G ఫోన్ భలే ఉందిగా.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?
రోగనిరోధక శక్తిని పెంచుతుంది :
పాలకూరలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయపడతాయి.
బరువు సులభంగా తగ్గొచ్చు :
పాలకూరలో ఫైబర్ అధికంగా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా, బరువును నియంత్రించడంలో సాయపడుతుంది.