Realme 13 Pro Price : రియల్‌మి లవర్స్‌కు అదిరే వార్త.. కేవలం రూ.20వేలకు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. రియల్‌మి 13 ప్రో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ బ్యాంక్ ఆఫర్లతో పాటు 13 ప్రోపై ధర తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా అదనపు డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. రియల్‌మి 13 ప్రోలో అందుబాటులో ఉన్న డీల్స్, ఆఫర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రియల్‌మి 13 ప్రో ధర, ఆఫర్లు :
రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999కు పొందవచ్చు. ఈ ఫోన్ గత ఏడాది జూలైలో రూ.26,999కి లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై ఫ్లాట్ రూ. 1250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఆ తర్వాత రియల్‌మి 13 ధర రూ. 18,749 అవుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.17,400 డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఆఫర్ బెనిఫిట్ ఎక్స్చేంజ్ ఫోన్ ప్రస్తుత వర్కింగ్ స్టేటస్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
రియల్‌మి 13 ప్రో స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 13 ప్రోలో 6.7-అంగుళాల Full HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2412×1080 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz శాంప్లింగ్ రేట్ ఉంది. 13 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా realme UI 5.0 OSలో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi, USB టైప్-C పోర్ట్, బ్లూటూత్ 5.2 సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
Read Also : Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. రియల్‌మి 13 ప్రో బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా పొందవచ్చు.
కొలతలు విషయానికి వస్తే.. ఈ ఫోన్ పొడవు 161.34 మిమీ, వెడల్పు 75.91 మిమీ, మందం 8.41 మిమీ, బరువు 183.00 గ్రాములు ఉంటుంది. ఈ ఫోన్ మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దుమ్ము, నీటి రక్షణ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉంది.