- జనవరి 25, 2026 బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
- భారత్‌లో ఈరోజు బంగారం ధర ఎంతంటే?
- 24 క్యారెట్ల బంగారం ధర ఎంత ఉందంటే?
- 22 క్యారెట్ల బంగారం ధర ఎంత ఉందంటే?
- తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధరలు తగ్గాయా పెరిగాయా?
Gold Rate Today 25 January 2026 : బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. బంగారం కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే.. జనవరి 25న ఆదివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో మీకు తెలుసా? సాధారణంగా బంగారం ధరలు మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కారణంగా బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది.
బంగారం ధరలు పెరుగుదల ట్రెండ్ కొనసాగుతోంది. కొత్త రికార్డు గరిష్టాలను బంగారం ధరలు చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం, మార్కెట్ అస్థిరతల సమయంలో సంపదను కాపాడుతుందని భావిస్తుంటారు. అందుకే ఎక్కువగా బంగారం కొనడం లేదా చాలా కాలంగా సురక్షితమైన పెట్టుబడులలో ఒకటిగా నిలుస్తోంది.
అత్యంత ఖరీదైన బంగారానికి విలువ ఎక్కువ. అందుకే బంగారం శతాబ్దాలుగా సంపదకు చిహ్నంగా మారింది. అంతేకాదు.. బంగారానికి ఎంత నిల్వ చేసుకుంటే అంత వాల్యూ పెరుగుతుంది. సామాన్యుల నుంచి బిలియనీర్ల వరకు బంగారానికి ఎక్కువగా ప్రధాన్యత ఇస్తుంటారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో లేదా అనిశ్చిత సమయాల్లో సెక్యూరిటీ కోరుకునే పెట్టుబడిదారులకు బంగారంపై పెట్టుబడి అనేది అద్భుతమైన ఆప్షన్.
ప్రతిరోజూ బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అయితే, ఈ వారం బంగారం, వెండి ధరలలో భారీ మొత్తంలో హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వారం చివరి రోజు జనవరి 25 ఆదివారం దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలలో ఎలాంటి మార్పు లేదు. అయితే, శనివారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. వారపు సెలవు కారణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్ ఈరోజు మూతపడింది.
Gold Rate Today 25 January 2026 : భారత్‌లో ఈరోజు బంగారం ధర ఎంతంటే? :
ఈరోజు, ఆదివారం భారత బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.16,041గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,705గా ఉంది. 18 క్యారెట్ల బంగారం (999 గోల్డ్) ధర గ్రాముకు రూ.12,034కు లభిస్తుంది.
24 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే? :
భారత బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 16,041గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,60,410గా ఉంది.

22 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే? :
22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,705గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,47,050గా ఉంది.
Gold Rate Today 25 January 2026 : తెలుగు రాష్ట్రాలో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ.1,60,260గా కొనసాగుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ. 1,46,900గా ఉంది.
విజయవాడ నగరంలో ఈరోజు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 16,026గా ఉంది. అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 14,690గా ఉంది. 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ. 12,019 గా ఉంది.
ఈ నగరంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ.1,60,260గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ. 1,46,900గా ఉంది.
విశాఖలో బంగారం ధర ఎంతంటే? :
విశాఖపట్నం నగరంలో ఈరోజు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 16,026గా ఉంది. అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 14,690గా ఉంది. 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ. 12,019గా ఉంది.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ.1,60,260గా ఉంటే.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ. 1,46,900 ట్రేడ్ అవుతోంది.
















