- హీరో గ్లామర్ 125cc బైక్ మైలేజీ 650 కిలోమీటర్ల రేంజ్
- రూ. 80 వేల నుంచి రూ. లక్ష బడ్జెట్‌లో అద్భుతమైన ఆప్షన్
- హీరో గ్లామర్ X డ్రమ్ బ్రేక్ ధర రూ. 82,967 (ఎక్స్-షోరూమ్)
- డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 92,186 (ఎక్స్-షోరూమ్)
Hero Glamour Review : మీరు తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం దూసుకెళ్లే బెస్ట్ మైలేజ్ బైక్ కోసం చూస్తున్నారా? ఫుల్ ట్యాంక్ చేస్తే చాలు 650 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగల బైక్ అందుబాటులో ఉంది. అదే హీరో గ్లామర్ 125cc బైక్. రూ. 80 వేల నుంచి రూ. లక్ష బడ్జెట్‌లో అద్భుతమైన ఆప్షన్ అందిస్తుంది.
మీరు రోజువారీ ఆఫీసుకు బైక్ పై వెళ్లేందుకు చూస్తుంటే.. అద్భుతమైన మైలేజ్‌తో ఈ బైక్ కొనేసుకోవచ్చు. ఈ బైక్ కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు చేయాలంటే.. ఈ బైక్‌లో ఏ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ లీటరు ఫ్యూయిల్ ఎంత మైలేజ్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం..

హీరో గ్లామర్ 125cc ధర :
హీరో గ్లామర్ X డ్రమ్ బ్రేక్ ధర రూ. 82,967 (ఎక్స్-షోరూమ్), డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 92,186 (ఎక్స్-షోరూమ్)తో వస్తుంది. మీ బడ్జెట్ ఆధారంగా వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. పోటీ పరంగా ఈ బైక్ హోండా SP 125, బజాజ్ పల్సర్ 125, టీవీఎస్ రైడర్ 125 వంటి మోడళ్లతో పోటీపడుతుంది.
హీరో గ్లామర్ 125cc మైలేజ్ :
కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ మోటార్‌సైకిల్ లీటరు ఫ్యూయిల్ 65 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ 10-లీటర్ ఇంధన ట్యాంక్‌తో వస్తుంది. లీటరుకు 65 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. తత్ఫలితంగా, బైక్ ఫుల్ ట్యాంక్‌తో 650 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు.
ఇంజిన్ :
ఈ బైక్ 124.7cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 10.39bhp, 10.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. స్టైలిష్ డిజైన్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో ఈ బైక్ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. డ్రమ్ బ్రేక్‌లు కూడా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో అమర్చారు.
















