- 6.72-అంగుళాల డిస్‌ప్లే,
- 50MP ప్రైమరీ కెమెరా, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
- 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్
- రియల్‌మి ఫోన్ ప్రారంభ ధర రూ. 15,000
Realme P4x 5G Launch : రియల్‌మి ఇండియా కొత్త 5G ఫోన్ రిలీజ్ చేసింది. పవర్‌ఫుల్ ఫీచర్లతో 50MP మెయిన్ లెన్స్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 7000mAh బ్యాటరీ కలిగి ఉంది.
రియల్‌మి కొత్త ఫోన్ (Realme P4x 5G) వచ్చేసింది. భారత మార్కెట్లో రియల్‌మి P4x 5G ఫోన్ లాంచ్ అయింది. కంపెనీ కొత్త P-సిరీస్ హ్యాండ్‌సెట్ 7000mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది.
ఈ రియల్‌మి ఫోన్ 6.72-అంగుళాల డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ IP64 రేటింగ్ కలిగి ఉంది. కంపెనీ ఈ రియల్‌మి ఫోన్‌ను రూ. 15,000 ప్రారంభ ధరకు రిలీజ్ చేసింది. రియల్‌మి 5జీ ఫోన్ ధర, ఇతర ముఖ్య ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం.
రియల్‌మి P4x 5G ధర ఎంత? :
రియల్‌మి P4x 5G ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.15,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.16,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.18,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. మీరు ఈ రియల్‌మి ఫోన్‌ను మాట్టే సిల్వర్, ఎలిగెంట్ పింక్ లేక్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
Read Also : Airtel Prepaid Apple Music : ఎయిర్‌టెల్ అద్భుతమైన ఆఫర్.. ఈ యూజర్లు ఆపిల్ మ్యూజిక్ ఫ్రీగా పొందొచ్చు!
లాంచ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ రూ. 1,000 కూపన్ డిస్కౌంట్, రూ. 1,500 బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తోంది. డిస్కౌంట్ తర్వాత రియల్‌మి ఫోన్ ధర రూ.13,499 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రియల్‌మి ఫోన్ డిసెంబర్ 10న అమ్మకానికి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్‌సైట్ (Realme.com)లో అందుబాటులో ఉంటుంది.
రియల్‌మి P4x 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి (Realme P4x 5G) ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.72-అంగుళాల ఫుల్-HD LCD డిస్‌ప్లే కలిగి ఉంది. స్క్రీన్ 1000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది.
మైక్రో SD కార్డ్ ఉపయోగించి ఫోన్ స్టోరేజీని 2TB వరకు విస్తరించవచ్చు. ఆప్టిక్స్ పరంగా, రియల్‌మి ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు పవర్ అందించే 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీ కలిగి ఉంది.
















