Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర రూ.6,499 నుంచి ప్రారంభమవుతుంది. 6GB + 128GB వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
Poco C71 Discount Offers
Poco C71 Discount Offers

Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 ఫోన్ బడ్జెట్ ఆఫర్‌గా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే మంచి స్పెసిఫికేషన్లతో వస్తుందని పేర్కొంది. 6.88-అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ TUV రీన్‌ల్యాండ్ ఐ ప్రొటెక్షన్ వెరిఫికేషన్ పొందిందని కూడా పేర్కొంది.Unisoc T7250 SoC ద్వారా పవర్ పొందుతుంది. గరిష్టంగా 6GB RAMతో వస్తుంది. స్టోరేజ్ ఉపయోగించి RAM వర్చువల్‌గా 12GB వరకు విస్తరించవచ్చునని కంపెనీ చెబుతోంది. భారీ మల్టీ-టాస్కింగ్, గేమింగ్ సమయంలో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

భారత్‌లో Poco C71 ధర, లభ్యత :
భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర రూ.6,499 నుంచి ప్రారంభమవుతుంది. 6GB + 128GB వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ పోకో ఫోన్ ధర రూ. 7,499కు పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ను డెసర్ట్ గోల్డ్, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Poco C71 సేల్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమవుతుంది. దేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. కొన్ని సేల్ ఆఫర్లు కూడా ప్రకటించింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు పోకో C71ని రూ. 5,999 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయగలరు. ఎయిర్‌టెల్ వినియోగదారులకు అదనపు 50GB డేటా వంటి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఏప్రిల్ 10న మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

పోకో C71 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
పోకో C71 ఆండ్రాయిడ్ 15 ఆధారితంగా రన్ అవుతుంది. వినియోగదారులు రెండు ఏళ్ల Android OS అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్ పొందుతారని కంపెనీ పేర్కొంది. పోకో C71 6.88-అంగుళాల HD+ (720×1,640 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది.

Advertisement

120Hz వరకు రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 600nits పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ TUV రీన్‌ల్యాండ్ ఐ ప్రొటెక్షన్ వెరిఫికేషన్ పొందిందని పోకో తెలిపింది. ఇందులో తక్కువ బ్లూ లైట్, సిర్కాడియన్ సర్టిఫికేషన్లు ఉన్నాయి.

Unisoc T7250 SoC ద్వారా పవర్ పొందుతుంది, 6GB వరకు RAM, 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. స్టోరేజ్ సాయంతో RAM వర్చువల్‌గా 12GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. తద్వారా స్టోరేజీని 2TB వరకు పెంచవచ్చు.

Advertisement

Poco C71 సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ప్రైమరీ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. పోకో C71 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీని అందిస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

Read Also : Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు

Advertisement

కనెక్టివిటీ ఆప్షన్లలో 4G VoLTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, FM, బ్లూటూత్ 5.2, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ IP52 దుమ్ము, స్ప్లాష్ నిరోధక బిల్డ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 171.79 x 77.8 x 8.26 మిమీ కొలతలు, 193 గ్రాముల బరువు ఉంటుంది.

Advertisement