Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా మహిళలు అద్భుతమైన (Women Loan Scheme) ప్రయోజనాలను పొందవచ్చు. మహిళలకు ఆర్ధిక సాయం అందించడమే లక్ష్యంగా ఈ కొత్త స్కీమ్ (How to Apply for Lakhpati Didi Scheme) అందుబాటులోకి వచ్చింది. ప్రతి మహిళ ఎవరిపై డిఫెండ్ కాకుండా తమ సొంత కాళ్ల మీద తాము నిలబడి ఆర్థికంగా ఎదిగేందుకు ఈ స్కీమ్ అద్భుతంగా సాయపడుతుంది.
ఏదైనా వ్యాపారం చేయాలంటే అందరికి ముందుగా లోన్లు కావాలి. ఆ లోన్ల కోసం ఎక్కువ వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. చాలామంది ఈ వడ్డీలకు భయపడి రుణాలను తీసుకునేందుకు భయపడుతుంటారు. ఇకపై అలాంటి భయమే లేకుండా మహిళలందరూ ‘లక్‌పతి దీదీ యోజన’ అనే పథకం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం కింద మహిళలు లక్షాధికారులుగా మారేందుకు అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.
Lakhpati Didi Scheme : రూ. 5 లక్షల లోన్.. రూపాయి వడ్డీ కూడా ఉండదు
అర్హత కలిగిన మహిళలకు రూ. 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. పైగా ఈ లోన్ తీసుకుంటే రూపాయి వడ్డీ కూడా కట్టనక్కర్లేదు అనమాట. లోన్ తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత గడువు తేదీలోగా చెల్లించాలి. ఈ స్కీమ్ మహిళలను సొంతంగా వ్యాపారం చేసేందుకు వీలుగా ఉంటుంది.
అంతేకాదు.. ఈ పథకంలో భాగంగా మహిళల కోసం ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. వ్యాపార పరంగా ఎదిగేందుకు ఈ ట్రైనింగ్ వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 2023 ఆగస్టులో ఈ పథకం ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు కోటి మంది మహిళలు లబ్దిపొందారు. ప్రారంభంలో 2 కోట్ల మంది లక్ష్యంతో స్కీమ్ ప్రారంభమైంది. ఇప్పుడు అది కాస్తా 3 కోట్ల మందికి విస్తరించింది.
Read Also : Tea Side Effects : టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యక్తులకు ప్రాణాంతకం కావచ్చు!
ఈ స్కీమ్ ద్వారా మహిళలు శిక్షణ పొందుతారు. ఏదైనా బిజినెస్ ప్రారంభించి అవసరమైన రుణం తీసుకోవచ్చు. ఇంతకీ ఈ లోన్ పొందాలంటే డాక్యుమెంట్లు సమర్పించాలి. అందులో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇన్‌కం ప్రూఫ్, బ్యాంక్ పాస్‌బుక్ తప్పనిసరిగా సమర్పించాలి. ఈ డాక్యుమెంట్లను లోకల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. మీ లోన్ అప్రూవల్ అయితే మహిళలకు రూ. 5 లక్షల వరకు లోన్ మంజూరు అవుతుంది. ఏదైనా సొంత బిజినెస్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు.
ఎవరు అర్హులు? :
ఈ పథకం కింద మీరు మహిళలు సులభంగా రుణం పొందవచ్చు . 18 ఏళ్ల వయస్సు నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏ మహిళ అయినా ప్రభుత్వ లక్‌పతి దీదీ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని కోసం, మహిళ ఆ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. స్వయం సహాయక బృందంతో అనుబంధం కలిగి ఉండటం తప్పనిసరి.
వ్యాపారం ప్రారంభించడానికి రుణం పొందడానికి, మీరు మీ ప్రాంతీయ స్వయం సహాయక సంఘ కార్యాలయంలో అవసరమైన పత్రాలు, వ్యాపార ప్రణాళికను సమర్పించాలి. ఆ తరువాత, దరఖాస్తు సమీక్షించి ఆమోదిస్తారు. ఆ తరువాత రుణం కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆదాయ రుజువు, బ్యాంక్ పాస్‌బుక్ కాకుండా, దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను కూడా సమర్పించాలి.