RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూ. 50 బ్యాంక్ నోటును జారీ చేయనుంది. ఈ రూ. 50 నోటుకు సంబంధించి కొత్త సమాచారాన్ని వెల్లడించింది. దేశ కేంద్ర బ్యాంకు త్వరలో కొత్త రూ.50 నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లపై కొత్త ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కొత్తగా నియమితులైన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.50 నోట్లను విడుదల చేయనుంది. డిసెంబర్ 2024లో శక్తికాంత దాస్ స్థానంలో మల్హోత్రా నియమితులయ్యారు.
“ఈ నోట్ల డిజైన్ మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ. 50 నోట్ల మాదిరిగానే ఉంటుంది” అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన అన్ని రూ. 50 డినామినేషన్ నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.
RBI 50 Note : సంజయ్ మల్హోత్రా ఎవరు? :
2022 సంవత్సరంలోనే, సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ గవర్నర్ పదవికి నామినేట్ చేసింది. ఇప్పటివరకు ఆయన ఆర్థిక సేవల విభాగం (DFS) కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ కు చెందిన సీనియర్ అధికారి. నవంబర్ 2020లో, ఆయన REC ఛైర్మన్, ఎండీగా నియమితులయ్యారు. ఆయన కొంతకాలం ఇంధన మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు.
Read Also : Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త.. 3 ఎకరాల వరకు ‘రైతు భరోసా’విడుదల.. మీ అకౌంట్లు చెక్ చేసుకోండి!
ప్రస్తుతం ఉన్న అన్ని రూ. 50 నోట్లు ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయి. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ 50 రూపాయల నోటు 66 మిమీ x 135 మిమీ కొలతలు కలిగి ఉండి ఫ్లోరోసెంట్ నీలిరంగు బేస్ కలర్ కలిగి ఉంటుంది. వెనుక భాగంలో హంపి రథంతో ఫొటో ఉంటుంది. దేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఇది సూచిస్తుంది. రూ. 2వేల రూపాయల నోట్ల విషయానికొస్తే.. వాటిని నిషేధించి ఏడాదిన్నర దాటింది.
అయినప్పటికీ ప్రజలు ఇప్పటికీ గణనీయమైన మొత్తాన్ని కలిగి ఉన్నారు. జనవరి 31, 2025 నాటికి, ఈ గులాబీ నోట్లలో 98.15 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని, దాదాపు రూ. 6,577 కోట్లు ఇప్పటికీ ప్రజలలో చెలామణిలో ఉన్నాయని ఆర్‌బిఐ ఇటీవల తెలిపింది.
డిసెంబర్ 31 నాటికి, ఆర్బీఐ డేటా ప్రకారం.. మొత్తం రూ.6,691 కోట్ల నోట్లు చెలామణిలో ఉన్నాయి. మే 19, 2023న, సెంట్రల్ బ్యాంక్ తన క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2వేల నోట్లను దశలవారీగా రద్దు చేయాలని నిర్ణయించింది.