Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త.. మీకు మూడు ఎకరాలు ఉన్నాయా? అయితే, మీ బ్యాంకు అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసాను అందిస్తోంది. మొన్నటివరకు రెండు నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మూడు ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తోంది.
మూడు ఎకరాల సాగు చేసే భూములకు ఎకరానికి రూ. 6వేల చొప్పున రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 3 ఎకరాలు కలిగిన రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ.1,230 కోట్లు క్రెడిట్ చేసింది. రైతు భరోసా కింద తెలంగాణ సర్కార్ మొత్తం రూ.3,487.25 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపింది. డీబీటీ పద్ధధిలో రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తోంది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే పథకాన్ని రైతుబంధు పేరుతో అమలు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోక వచ్చాక ఆ పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చింది.
Rythu Bharosa : ప్రతి ఎకరాకు రూ. 6 వేలు నిధుల పంపిణీ
అంతేకాదు.. అప్పటి ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయాన్ని రూ. 10 వేల నుంచి ఏకంగా రూ. 12వేలకు పెంచింది. అంటే.. ప్రతి ఎకరా భూమి కలిగిన ప్రతి రైతు అకౌంట్లలో రూ.6వేలు క్రెడిట్ అవుతాయి. ప్రతి ఏడాదిలో రైతుభరోసా పథకం కింద రెండు సార్లు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
రైతు భరోసా పథకం కింద తెలంగాణ సర్కార్ ప్రతి ఏడాదిలో రూ.20 వేల కోట్లను రైతుల అకౌంట్లలో క్రెడిట్ చేయనుంది. ప్రస్తుతం తక్కువ విస్తీర్ణంలోని భూముల దగ్గర నుంచి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే భూముల వరకు రైతు భరోసా పెట్టుబడి సాయంగా నిధులను విడుదల చేస్తోంది.