...

Ram Gopal Varma : నీకు నీ డ్రైవర్‌కు తేడా లేదా? మంత్రి పేర్ని నానిపై ఆర్జీవీ సెటైర్..

Ram Gopal Varma : ఏపీలోని థియేటర్స్ టికెట్స్ ప్రైస్ విషయమై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. టికెట్ల ధర తగ్గింపును వ్యతిరేకిస్తూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రి పేర్ని నానికి పది ప్రశ్నలు వేశారు. కాగా, వాటికి మంత్రి నాని సైతం స్పందించారు.

‘గౌరవనీయులైన ఆర్జీవీ గారు.. మీ ట్వీట్లు చూశాను ’ అని పేర్కొంటూ మంత్రి నాని పలు విషయాలు ట్విట్టర్ వేదికగా తెలిపారు. వంద రూపాయల టికెట్‌ను రెండు వేల రూపాయలకు అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకానమిక్స్ చెప్పాయ్ ? ఏ చట్టం చెప్పింది. ? డిమాండ్ అండ్ సప్లైనా అది? లేదా బ్లాక్ మార్కెటింగా అని పేర్ని నాని ప్రశ్నించారు. కాగా, ఈ కామెంట్స్ పైన ఆర్జీవీ మళ్లీ స్పందించారు.

ramgopal varma
ramgopal varma

ముడి పదార్థం రూ.500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్‌ను రూ. 5 కోట్లకు అమ్ముతారని, ముడి పదార్థానికి మాత్రమే విలువని ఇస్తే ఐడియా ఎలా ధర నిర్వహిస్తామని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కంటిన్యూయస్‌గా అన్ని ఇంకా బెటర్‌గా ఉండేలా చేయడమని, అలా ప్రయత్నించడమని, బెటరా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సినిమాకు సంపూర్ణేశ్ బాబు సినిమాకు మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్‌కు కూడా తేడా లేదా? అని వర్మ సెటైర్ వేశాడు.

మొత్తంగా ట్విట్టర్ వేదికగా ఏపీ మంత్రి పేర్ని నాని, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే కొందరు ఆర్జీవీకి మద్దతు తెలుపుతున్నారు. మరి కొందరు వైసీపీ వర్గీయులు మంత్రి పేర్ని నానిని సపోర్ట్ చేస్తున్నారు.

Read Also : Sri Reddy : నన్ను దాటుకునే జగన్ జోలికి వెళ్లాలి.. ఆర్జీవీపై శ్రీరెడ్డి ఫైర్..