...

YS Sharmila AP party : ఏపీలో పార్టీ పెడతానన్న వైఎస్ షర్మిల.. జగనన్న బాణం బ్యాక్ టు ఏపీ..?

YS Sharmila AP party : ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రావడానికి జగన్ కృషి ఎంతుందో అంతే స్థాయిలో వైఎస్ షర్మిల కష్టం కూడా ఉంది. జగన్ జైలులో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల ఊరు వాడా కలియ తిరుగుతూ తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటూ ప్రచారం చేశారు. ఏపీలో తిరిగి రాజన్న రాజ్యం తీసుకొస్తామని పాదయాత్ర నిర్వహించి ప్రజలను ఉత్తేజపరిచారు. ఆ తర్వాత జగన్ జైలు నుంచి బయటకు రావడం, ఎన్నికల సమయం వరకు ప్రజల్లోనే ఉన్నారు. ఏకంగా ఏడాదికి పైగా పాదయాత్ర చేపట్టారు.

రాజన్నను మర్చిపోని ప్రజలు జగన్‌కు భారీ మెజార్టీతో పట్టం కట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ షర్మిల అన్న అండర్‌లో మంత్రిగా ప్రమాణం చేసి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక షర్మిల మంత్రి కాలేదు కదా.. పార్టీలో కనీసం నామినేట్ పోస్టు కూడా తీసుకోలేదు. తాను తెలంగాణ కోడలిని అని చెప్పుకుంటూ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో పార్టీని వైఎస్సార్‌టీపీ పార్టీని స్థాపించింది.

రాజన్న మీద అభిమానం ఉన్న ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుంటారని భావించిన షర్మిల వ్యూహం బెడిసికొట్టింది. ఆంధ్రా పాలన వద్దనే పోరాడి మరీ తెలంగాణ తెచ్చుకున్న ప్రజలు తిరిగి ఏపీ పెద్దరికాన్ని ఎందుకు కోరుకుంటారనే లాజిక్ మరిచారు షర్మిల. ఫలితంగా షర్మిల ఎక్కడకు వెళ్లినా ప్రజాదరణ అంతంతగానే ఉంది.

సీఎం అయ్యేందుకు ఇది సరిపోదు. కీలక లీడర్లు ఎవరూ ఆ పార్టీలో లేరు. వాస్తవం గుర్తించిన షర్మిల ఏపీలో పార్టీ పెడతానని తాజాగా కామెంట్ చేసింది. దీనిని బట్టి తన ఓటమిని అంగీకరించిందా? ఏకంగా అన్న పీఠానికి చెల్లెలు గురిపెట్టిందా? జగనన్న విసిరిన బాణం తిరిగి తనకే గుచ్చుకోబోతోందా? అని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read Also : CM Jagan : సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీలో హాట్ టాపిక్‌గా పోలవరం, అమరావతి ఇష్యూ..?