Healthy tips : మానవ శరీరారనికి తగిన మంచి ఆహారాలను తినకపోవడం, అలాగే పని ఒత్తిడి, అతిగా ఆలోచించడం వంటి కారణాల వల్ల మతి మరుపు వస్తుంది. మతి మరుపుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ఆహారాలు ఈ సమస్యను నివారించడంలో తోడ్పడతాయి. కొన్ని రకాల ఆహారాలు జ్ఞాపకశక్తిని బాగా పెంచుతాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అండే ట్యూనా, సాల్మన్ వంటి చేపలను తరచుగా తింటే మతిమరుపు సమస్య దూరం అవుతుంది. తాజా ఆకు కూరల్ల ఖనిజాలు, విటామిన్లు, ఫఐబర్, ఐన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందుకోసం పాలకూర, బచ్చలి కూర, బ్రొకోలి వంటి ఆకు కూరలను ఎక్కువగా తినాలి. ఇవి మనషిలో జ్ఞాపక శక్తిని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి. మెదడు కూడా చురుగ్గా పని చేస్తుంది. గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒఖ గుడ్డును తింటే చాలా మంచిది. అలాగే గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఇలాంటివన్నీ ఉండేలా చూసుకుంటే మరింత మంచిది.
Read Also : Health tips: పాలకూరను ఎక్కువగా తింటున్నారా.. ఆగండి.. అలా అస్సలే చేయొద్దు