Tamarind benefits: చింతపండు ఉపయోగాలు తెలిస్తే పుల్లగా ఉన్నా ఫుల్లుగా లాగించేస్తారు..!

Tamarind benefits: చాలా మంది ప్రతిరోజూ వంటకాల్లో చింతపండును వాడుతుంటారు. కొంత మంది తక్కువగా వాడినా, మరికొంత మంది అయితే రోజూ చింతపండుతో ఏదో ఒక వంటకం చేస్కుంటూనే ఉంటారు. పచ్చి పులుసు దగ్గర నుంచి పలు రకాల కూరల వరకు వాడేస్తుంటారు. అయితే పుల్ల పుల్లగా ఉండే ఈ చింతపండు వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చింతపండులో అద్భుతమైన ఒషధ గుణాలు ఉన్నాయి. కూరల్లో పులుపు, రుచి కోసం వాడే చింతపండు ఆరోగ్యాన్ని కాపాడడంలో, చర్మాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చింతపండులో విటామిన్స్, ఐరన్, పొటాషియం, ఖనిజ పోషకాలు, పీచు పదార్థంతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వంటి పాలీ ఫెనాల్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయ పడతాయి. చింతపండు బెరడు, వేరు పదార్థాలు కడుపు నొప్పికి సమర్థవంతమైన నివారణగా నిరూపించబడ్డాయి. అందుకే మీరు కూడా రెగులర్ గా చింతపండును వాడి ఆరోగ్యంగా ఉండండి.

Advertisement