Health tips : ఉదయం నిద్ర లేచింది మొదలు మన దిన చర్య మొదలవుతుంది. కొందరికి నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే దినచర్య మొదలు కాదు. మరికొందరికి సిగరెట్ తాగనిదే పని జరగదు. కానీ వాటితో మనకు ఇబ్బందులే. ఆరోగ్య సమస్యలే ఎదురవుతాయి. మనకు ఎలాంటి దుష్ప్రభావాలు కల్గకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో గ్రీన్ టీ లాంటివి తీసుకుంటున్నారు. మన ఆరోగ్య పరిరక్షణలో భాusirikaగంగా మనకు ప్రయోజనాలు కల్గించేవి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా?
రోజూ ఉదయం నిద్ర లేవగానే ఉసిరిని తీసుకుంటే ఎన్నో లాభాలుంటాయి. ఇందులో ఉండే విటామిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి గుజ్జును గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలో చర్మ సౌందర్యం, శిరోజాల సంరక్షణకు సంబంధించిన పోషకాలు ఉండటంతో వీటిని ఎక్కువగా వాడాలని చెబుతున్నారు.
రోజూ పరగడుపున తేనె తీసుకుంటే ఉపయోగమే. ఇందులోకి నిమ్మరసం జోడిస్తే.. రుచితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికర బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. తేనెను రోజు ఆహారంలో భాగం చేసుకుంటే అధిక బరువు సమస్య దూరం చేసుకోవచ్చు. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అందుకే తేనెను మన ఆహారంలో కలుపుకొని తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.
Read Also : Amla seeds : ఉసిరికాయ తిన్న తర్వాత గింజలను పడేస్తున్నారా.. ఈ లాభాలు తెలుసుకుంటే ఇంకోసారి అలా చేయరు
Read Also : Amla Benefits : ఉసిరితో ఇన్ని ఉపయోగాలా.. అర్జెంటుగా తినేయండి మరి..