Amla seeds : ఎ్ననో ఔషధ గుణాలున్నది ఉసిరి కాయ. అందుకే ఉసిరిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఉసిరిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది చర్మ సౌందర్యానికి చాలా బాగా పని చేస్తుంది. జుట్టును బలంగా చేయడానికి ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉసిరి గురించి దాని ఉపయోగాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఉసిరి గింజల్లోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ఉసిరి గింజల్ల విటమిన్ బి కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియం, కెరోటిన్, ఐరన్, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ విత్తనాలు ఉసిరికాయతో సమానంగా శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఉసిరి గింజలతోచాలా ప్రయోజనాలు ఉన్నాయి. మలబద్దకం, అజీర్ణం లేదా ఆమ్లత్వంతో వచ్చే సమస్యలతో బాధపడుతున్న వారికి ఉసిరి గింజలు చాలా బాగా పని చేస్తాయి. ఉసిరి గింజలతో తయారు చేసిన పొడిని గోరు వెచ్చని నీళ్లలో వేసుకుని తాగాలి. దీని వల్ల ఎంతో ఉపశమనం ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలకు జామకాయ గింజలు, ఉసిరి గింజలు చక్కగా పని చేస్తాయి. ఉసిరి గింజలను కొబ్బరి నూనెలో వేసి వాటిని పేస్ట్ ల సిద్ధం చేసుకోవాలి. ఆ పేస్ట్ ను మొటిమలున్న ప్రాంతాల్లో పెట్టుకుంటే మొటిమలు పోతాయి.
చాలా మందికి ముక్కు నుంచి రక్తం కారుతుంది. ఇలాంటి సమస్యలకు ఉసిరి గింజలు మంచి ఔషధం. ఉసిరి గింజలతో చేసిన పొడిని పేస్ట్ ల తయారు చేసి తలకు పట్టించాలి.
Read Also : Health: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే ఇది అదే కావచ్చు వెంటనే అలర్ట్ అవ్వండి?