Health Tips: వేసవికాలంలో సబ్జా గింజలను ఇలా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

Health Tips:వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యల నుండి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో సబ్జా గింజలు ఉపయోగపడతాయి. సబ్జా గింజలు చూడటానికి చాలా చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుండి మన శరీరానికి కాపాడుతాయి. సబ్జా గింజలు ఏ విధంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ గుణాలు సబ్జా గింజలలో అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ, ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు సబ్జా గింజలను తీసుకోవటం వల్ల ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందించి, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంతేకాకుండా వేసవికాలంలో శరీరంలో అధిక ఉష్ణోగ్రత తగ్గించడానికి కూడా ఈ సబ్జా గింజలు చాలా ఉపయోగపడతాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి మనం తీసుకునే ఫ్రూట్ జ్యూస్, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలలో సబ్జా గింజలు కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

శారీరక శ్రమ చేసేవారు,క్రీడాకారులు ప్రతిరోజు సబ్జా గింజలను రాత్రిపూట నానబెట్టి ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల వారికి కావాల్సిన శక్తి లభించి రోజంతా హుషారుగా ఉండేలా చేస్తాయి. ఈ గింజలలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది.సబ్జా గింజలలో ఉన్న ఆల్ఫాలినోలిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గిస్తుంది.

Advertisement

సబ్జా గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో కొంచం తేనె, అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చేస్తాయి. సబ్జా గింజలు నానబెట్టిన నీటిని ప్రతి రోజు తాగడం వల్ల బిపి, గుండె సంబంధిత సమస్యలు నుండి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు ఈ నీటిని తాగటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel