...

Health: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే ఇది అదే కావచ్చు వెంటనే అలర్ట్ అవ్వండి?

Health : సాధారణంగా కొందరిలో కొన్ని అనారోగ్య సమస్యలను సూచించే లక్షణాలు ముందుగానే కనపడుతూ వారిని హెచ్చరిస్తూ ఉంటాయి. ఇలా ముందుగానే కొన్ని లక్షణాలను గుర్తించి త్వరగా చికిత్స తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.అయితే ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారం వల్ల ఎన్నో రకాల వ్యాధులు మనల్ని చుట్టు ముడుతున్నాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్య తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి అధికమవుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రక్తహీనత సమస్య వెంటాడుతోంది. అయితే ముందుగా రక్తహీనత సమస్య వచ్చిన వారిలో ఈ లక్షణాలను ఉంటాయి.ఇలాంటి లక్షణాలు కనపడితే మీరు ఐరన్ లోపంతో బాధ పడుతున్నట్లు అర్థం.

Health
Health

*మీరు చిన్నచిన్న పనులు చేసి అలసి పోతూ చాతిలో నొప్పి కనుక ఉంటే మీరు ఐరన్ లోపంతో బాధ పడుతున్నట్లు అర్థం. అలాగే ఊపిరి తీసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ లోపం కారణంగా శ్వాసకోస సమస్యలు ఏర్పడతాయి.

*సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ తలనొప్పి రావడం సర్వసాధారణం. అయితే మాటిమాటికి తల నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇలా తరచు తలనొప్పి సమస్యతో బాధపడేవారిలో ఐరన్ సమస్య వెంటాడుతోందని అర్థం.

*మన శరీరంలో హిమోగ్లోబిన్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ క్షణం శరీరం పాలిపోయినట్టు కనిపిస్తుంది. ఇలా శరీరం పాలిపోయినట్టు కనబడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అలాగే కనురెప్పల లోపలి భాగం తెల్లగా ఉంటుంది. అదేవిధంగా మన నాలుక రంగు రుచి కూడా కోల్పోతుంది. ఇలాంటి లక్షణాలు కనపడితే మీకు ఐరన్ లోపం ఉన్నట్లు అర్థం.

Read Also : Wheat Grass Juice : ఈ గోధుమ గడ్డి జ్యూస్‌ తాగితే చాలు.. ఎలాంటి రోగమైన ఇట్టే పారిపోవాల్సిందే..!