Health tips: పాలకూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూరతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే పాలకూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అతి ఎప్పుడూ మంచిది కాదన్న విషయం తెలిసిందే. అలాగే పాలకూర కూడా అతిగా తినవద్దని అంటున్నారు వైద్యులు. పాలకూర ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
ముందుగా చెప్పుకున్నట్లు పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ ఆక్సాలిక్ యాసిడ్ ఇతర ఖనిజాలను గ్రహించే శరీరం సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరానికి జింక్, మెగ్నేషియం, కాల్షియాన్ని అందకుండా ఆక్సాలిక్ యాసిడ్ అడ్డుకుంటుంది. దాని వల్ల శరీరంలో ఖనిజ లోపం ఏర్పడుతుంది. దాని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ పాలకూర తినవద్దని వైద్యులు గట్టిగా చెబుతుంటారు. పాలకూరలో ఇతర పోషకాల మాదిరే ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పాలకూర తిన్న తర్వాత శరీరంలో ఈ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ మొత్తంలో శరీరంలో పేరుకుపోయిన ఆక్సాలిక్ యాసిడ్ ను బయటకు పంపించడం కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆక్సాలిక్ యాసిృడ్ కాస్త.. కాల్షియం ఆక్సలేట్ రాయిగా మారుతుంది.
అలాగే పాలకూరను ఎక్కువగా తినడం వల్ల శరీరం తీవ్ర అలసటకు గురి అవుతుంది. తన శక్తిని కోల్పోతుంది. దాంతో రోజంతా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది.