YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలు చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్… చిప్ ఉండాల్సింది మెదడులో అంటూ కామెంట్!

YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ తనపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తాను ఇచ్చిన హామీలను 95% అమలు చేశామని వెల్లడించారు.అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని అలాగే లక్షకు పైగా ఉద్యోగ ప్రకటన చేస్తూ గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల వాకిట్లోకి ప్రభుత్వ సేవలను అమలు పరచామని ముఖ్యమంత్రి వెల్లడించారు.గతంలో చెప్పిన విధంగానే తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అదే ధైర్యంతోనే వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగడానికి వెళ్తున్నామని తెలిపారు.

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

చంద్రబాబు నాయుడు మాదిరిగా తాను గత మూడు సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీ గురించి ఆలోచించలేదని ప్రజలకు ఏం చేస్తే మంచి కలుగుతుంది ప్రజలను అభివృద్ధి దిశగా ఎలా నడిపించాలని ఆలోచన చేశామని తెలిపారు.ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన తన ప్రయాణం 151 ఎమ్మెల్యేల వరకు చేరిందని చంద్రబాబు నాయుడు మాదిరిగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను లాక్కోవడానికి తాను ఎప్పుడు ప్రయత్నం చేయలేదని జగన్ పేర్కొన్నారు.ఇకపోతే 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు తన కుప్పం నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు.

YS Jagan Mohan Reddy : చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్… చిప్ ఉండాల్సింది మెదడులో అంటూ కామెంట్…

Advertisement

కుప్పం ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వమే ఆ నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా చేసిందని జగన్ గుర్తు చేశారు.ఇక జగన్ మాట్లాడుతూ ఒక మనిషికైనా రాజకీయ పార్టీ కైనా రెండు గుణాలు ముఖ్యం ఒకటి క్యారెక్టర్ రెండవది క్రెడిబిలిటీ. ఈ రెండు ఏ మనిషినైనా ఏ పార్టీనైనా ధైర్యంగా ముందుకు నడిపిస్తాయని జగన్ పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకొని ఆ కష్టాల గురించి ఆలోచించే చిప్ గుండెలో ఉండాలని చెప్పారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఓ చిప్ చూపించారు. చిప్ ఉండాల్సింది వేళ్ళకు కాళ్లకు కాదు చిప్ ఉండాల్సింది బ్రెయిన్ లోను, గుండెలోను ఉండాలని జగన్ సూచించారు. ఆయనకు కేవలం పదవి వ్యామోహం తప్ప ప్రజలపై ప్రేమ లేదని ఈ సందర్భంగా ప్లీనరీ ముగింపు వేడుకలో జగన్ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also :  YS Vijayamma : వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేసిన వైయస్ విజయమ్మ.. వచ్చే ఎన్నికలలో కూడా జగనే ముఖ్యమంత్రి!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel