YS Vijayamma : వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. నేడు వైయస్ జయంతి కావడంతో ఈమె వైఎస్ఆర్సిపి ప్లీనరీ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని సభాముఖంగా వెల్లడించారు. ఇకనుంచి తాను వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవి నుంచి తప్పుకుంటున్నానని,ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను ఉద్దేశిస్తూ ఆమె ఈ విధంగా తన నిర్ణయాన్ని తెలియజేశారు.ఇక ఈ వేదికగా విజయమ్మ మాట్లాడుతూ షర్మిల తెలంగాణ కోడలిగా ఇక్కడ తన అన్నకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా తాను తెలంగాణలో పార్టీ పెట్టి వైయస్సార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని విజయమ్మ వెల్లడించారు.
వైయస్ జగన్ షర్మిల ఇద్దరు వైయస్సార్ ఆశయాలను సాధించడానికి పార్టీలు పెట్టారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఇకపోతే గత కొద్దిరోజుల క్రితం వైయస్ విజయమ్మ ప్రమేయం లేకుండా తాను రాయకపోయినా సంతకం చేయకపోయినా రాజీనామా లేకను విడుదల చేయడంపై ఈమె మండిపడ్డారు. ఆలేఖను చూసినప్పుడు ఎంతో బాధగా ఉందని ఈమె పేర్కొన్నారు. జగన్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారంటే దాని వెనుక ఎంతో కష్టం దాగి ఉందని ఈ జగమంత కుటుంబాన్ని వైయస్సార్ తనకు ఇచ్చి వెళ్లారని ప్రజల ఆశయాలతోనే ప్రజలలో నుంచి పుట్టినదే వైయస్సార్సీపీ పార్టీ అంటూ విజయమ్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పొమ్మన లేక పోగపెట్టినట్లు తన బిడ్డపై ఎన్నో కేసులు పెట్టి విచారణ పేరుతో ఆస్తులు జప్తూ చేసినప్పటికీ జగన్ ఏమాత్రం బెదరలేదని విజయమ్మ తెలిపారు
YS Vijayamma : గౌరవ అధ్యక్షత పదవికి వైయస్ విజయమ్మ రాజీనామా..
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, తాను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి మాత్రమే కాకుండా చెప్పనివి కూడా చేస్తున్నారని ఈ సందర్భంగా విజయమ్మ పేర్కొన్నారు.ఇకపోతే వచ్చే ఎన్నికలలో కూడా జగనే ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా ఈమె ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి తాను రాజీనామా చేస్తున్నందుకు ప్రతి ఒక్క అభిమాని తనను క్షమించాలని,వైయస్ కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ తన ప్రసంగాన్ని ముగిస్తూ తన అధ్యక్షత పదవికి రాజీనామా ప్రకటించారు.
Read Also : Prakash Raj : మోడీ పర్యటనపై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్.. చూసి నేర్చుకోవాలంటూ కామెంట్స్!
Tufan9 Telugu News And Updates Breaking News All over World