Telangana – BJP: త్వరలోనే తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం… నటి విజయశాంతి కామెంట్స్!

Telangana – BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి మోడీపై రాజకీయ యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలోనే తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్‌కు వెళ్లి అక్కడి సీఎంలను, ఇతర నేతలను కలిసి వచ్చారని వివరించారు. అయితే ఈ సమావేశాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదని చెప్పాలి. ఇక టిఆర్ఎస్ పార్టీని జాతీయస్థాయిలో తీసుకెళ్లి పిఎం కావాలనే కెసిఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యిందనే చెప్పాలి.

ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలలో భాగంగా నాలుగు రాష్ట్రాలలో మోడీ సర్కార్ విజయకేతనం ఎగురవేసింది. ఒక్క చోట మాత్రమే ఆప్ విజయం సాధించింది.ఇలా నాలుగు రాష్ట్రాలలో కాషాయం ఎగరడంతో కేసీఆర్ పరిస్థితి ముందుకా వెనక్కా అనే విధంగా మారిపోయిందని విజయశాంతి ఎద్దేవా చేశారు.ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న కేసీఆర్ కి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు అన్నట్లు రాములమ్మ మాట్లాడారు

ఇక ఈ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ ఫ్రంట్ స్టెప్ కు బ్రేక్ పడినట్లు అయింది. ఇక ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ ఎన్నికలలో బిజెపి పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని భావించిన కేసీఆర్ కు చుక్కెదురయింది. ఈ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్
ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేయలని కలలు కన్నాడు. అయితే ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు ఆయన కలలను కలలుగానే మిగిల్చి వేశాయి. ఇక బిజెపి హవా ఇలాగేకొనసాగుతుందని త్వరలోనే తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగుర వేస్తామని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel