Vangaveeti Radha : వంగవీటి రాధా ప్రజెంట్ టీడీపీలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరిన రాధ ఆ ఎన్నికల తర్వాత పాలిటిక్స్‌లో పెద్దగా యాక్టివ్ గా లేరు. అప్పుడప్పుడు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ప్రజెంట్ చర్చనీయాంశంగా ఉన్నాయి. తనను హత్య చేసేందుకుగాను కుట్ర జరుగుతున్నదని వంగవీటి రాధా సంచలన కామెంట్స్ చేశారు. రాధా వ్యాఖ్యలపైన కనీస మాత్రంగానైనా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాని భావి నేత నారా లోకేశ్ కాని స్పందించలేదు.
టీడీపీ కార్యకర్తపైన కేసు పెడితేనే చంద్రబాబు, లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించడం మనం గతంలో చూశాం. కాగా, కీలక నేత అయిన వంగవీటి రాధా తన పైన హత్యకు కుట్ర జరుగుతోందని స్వయంగా స్పష్టంగా ప్రకటించినా దానిపైన టీడీపీ స్పందించడం లేదు. మౌన ముద్ర దాల్చింది. కాగా, టీడీపీ అధినాయకత్వం వంగ వీటి రాధా విషయమై స్పందిచకపోవడానికి గల కారణాలేంటని చర్చించుకుంటున్నాయి టీడీపీ వర్గాలు.
వంగవీటి రాధా ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన పక్కన మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ క్రమంలోనే వారిరువురి సూచనల మేరకే రాధా అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని టీడీపీ అధినాయకత్వం అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ నుంచి వెళ్లిపోయేందుకుగాను వంగవీటి రాధా అటువంటి కామెంట్స్ చేసి ఉంటారా అని టీడీపీ భావిస్తున్నట్లు కనబడుతోంది. వంగవీటి రాధా వ్యాఖ్యలపై స్థానిక టీడీపీ నేతలు కాని కార్యకర్తలు కాని స్తబ్ధుగా ఉన్నారు. ఇంతకీ వంగవీటి రాధాపైన హత్యకు కుట్ర చేస్తున్నది ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. పోలీసులు ఈ విషయం తేల్చాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు.
Read Also : Ram Charan Comments : సమంతపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.. డిఫరెంట్‌గా స్పందిస్తున్న ఫ్యాన్స్..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world