Vangaveeti Radha : ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ లీడర్ వంగవీటి రాధా ప్రకటించడంతో ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి. ఇటీవల కాపు సామాజికి వర్గానికి చెందిన కీలక నేతలు పార్టీలతో సంబంధం లేకుండా భేటీ అయిన విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నాని, వైసీపీ మద్దతు దారు వల్లభనేని వంశీ వంటి వారు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. వంగవీటి రాధాతో వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే భేటీ అనంతరం వారి సమక్షంలోనే తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బాబు రాధా ఇంటికి వెళ్లి మాట్లాడారు.
దీనిపై వైసీపీ స్పోక్స్ పర్సన్ అంబటి రాంబాబు స్పందిస్తూ.. వంగవీటి రంగా దారుణ హత్యకు గురైనప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ రాధా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లగా డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయని.. ప్రస్తుతం టీడీపీ పార్టీ అధినేత బాబు వెళితే డోర్స్ ఎలా తెరుచుకున్నాయ్ అంటూ కీలకవ్యాఖ్యలు చేశారు. ఇకపోతే వంగవీటి రాధా హత్యకు దేవినేని అవినాష్ మనుషులు రెక్కీ నిర్వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రాధా సిద్ధంగా ఉన్నారంటూ పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న రాధా పార్టీని వీడితే టీడీపీకి పెద్ద నష్టం వాటిల్లుతుందని నేరుగా బాబు రంగంలోకి దిగారని తెలుస్తోంది. రాధా ఎక్కడ పార్టీని వీడుతారోనని బాబు బుజ్జగించేందుకు వచ్చారని వైసీపీ శ్రేణులు మాట్లాడుతుంటే.. నీ వెంట నేను, తెలుగుదేశం పార్టీ, కార్యకర్తలు, లీడర్లు అండగా ఉన్నారని ధైర్యం చెప్పేందుకు చంద్రబాబు రాధ ఇంటికి వెళ్లారని వైసీపీ లీడర్లకు తెలుగు తమ్ముళ్లు కౌంటర్ ఇస్తున్నారు.
Read Also : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్… ఆ స్థానం నాకు వద్దు..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world