Janasena Pawan Kalyan : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు రచించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అనగా 2019 ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం ఏర్పడింది. కాగా, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఈ క్రమంలోనే అధికార వైసీపీకి వ్యతిరేకంగా వెళ్లే దమ్ము జనసేనకు మాత్రమే ఉందని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇకపోతే పవన్ కల్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తన వద్ద ఉన్న మరో అస్త్రం వాడబోతున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2024 వరకు ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసుకుని ఎన్నికలకు ఒక ఏడాది ముందర మళ్లీ రాజకీయ క్షేత్రంలోకి పవన్ ఎంటర్ అవుతారని తెలుస్తోంది. తనకున్న అశేష అభిమాన గణం మొత్తాన్ని ఈ సారి ఓట్ల రూపంలోకి మలుచుకోవాలని పకడ్బందీ ప్లాన్ వేస్తున్నారట జనసేనాని.
వచ్చే ఎన్నికలను కాపు సామాజిక వర్గం శాసిస్తుందని ఇప్పటికే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కాపు సామాజిక వర్గాన్ని తన వైపునకు తిప్పుకోవాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికలు దగ్గరకు వచ్చే నేపథ్యంలోనే టీడీపీతోనూ పొత్తుకు చాన్సెస్ ఉంటాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీతోనూ పొత్తుకు సై అంటారని పలువురు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 2014 అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా మళ్లీ మహా కూటమి పొత్తు తెరమీదకు వచ్చి వైసీపీని ఓడించొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా జనసేనాని ఈ సారి తన పార్టీ తరఫున ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారని, అందుకుగాను బలమైన వ్యూహాలను రచించుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా? లేదా అప్పటి వరకు టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంటే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Read Also : Chandrababu : వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన నారా భువనేశ్వరి.. టీడీపీకి ప్లస్ పాయింట్
Tufan9 Telugu News providing All Categories of Content from all over world