Teenmar Mallanna : ఈటల రాజేందర్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విబేధించి బయటికొచ్చి హుజురాబాద్ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపెట్టిన నేత. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఆయన జోరు పెంచారు. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. కాబట్టి అందుకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. తాజాగా హుజురాబాద్ విజయంతో ఆ పార్టీ మరింత దూకుడును పెంచింది. ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలోనే ఆ పార్టీకి ఒక విషయం మాత్రం మింగుడు పడడం లేదని తెలుస్తోంది. అదే ఈటల హవానట..
కరీంనగర్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ కరీంనగర్ మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్ తో విబేధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. బీజేపీ మాత్రం ఈ పోరులో తాము పోటీ చేయడం లేదని ప్రకటించింది. కానీ బీజేపీలోనే ఉన్న ఈటల మాత్రం సర్ధార్ రవీందర్ సింగ్ కు తన మద్దతును ప్రకటించాడు. ఈ విషయంలో టీఆర్ఎస్ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అసలు బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఈటలనా? లేక బండి సంజయా అంటూ ప్రశ్నిస్తున్నారు? ఈ విషయంలో ఈటల జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తుందట.
అందుకోసమే తెలంగాణలో పాపులారిటీ ఉన్న నేతలను పార్టీలోకి తీసుకురావాలని యోచిస్తోందట. అలానే ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తీన్మార్ మల్లన్నను పార్టీలోకి ఆహ్వానించింది. తీన్మార్ మల్లన్న డిసెంబర్ 7 న పార్టీలో జాయిన్ అవుతున్నట్లు తెలుపుతూ చేసిన ట్వీట్ లో చాలా మంది బీజేపీ నాయకులను ట్యాగ్ చేశాడు కానీ ఈటల రాజేందర్ ను మాత్రం ట్యాగ్ చేయలేదు. అసలు తీన్మార్ మల్లన్న ఎందుకు ఇలా చేశాడని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
Read Also : CM Ys Jagan : ఏపీ తర్వాతి CS ఎవరు..? సీఎం జగన్ ఆ ఇద్దరిలో ఎవరిని అనుకుంటున్నారు..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world