Schools Reopen In Telangana : తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెరుచుకోనున్న పాఠశాలలు… ఎప్పుడంటే ?

Updated on: January 30, 2022

Schools Reopen In Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్​ వ్యాప్తితో రాష్ట్రంలో కేసులు పెరగడం వల్ల ఈ నెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కేసుల పెరుగుదల ఆగకపోవడం వల్ల ఆ సెలవులను 30 వరకు పొడిగించింది ప్రభుత్వం. 15 ఏళ్లు దాటిన వారికి టీకా పంపిణీ, విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి టీకా ఇవ్వడం.. మరోవైపు జ్వర సర్వే పూర్తవ్వడం వల్ల కరోనా వ్యాప్తి తీరును అంచనా వేసిన సర్కార్.. విద్యాసంస్థలు తెరిచేందుకు మొగ్గు చూపింది.

ప్రభుత్వం తాజాగా స్కూళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరవాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన చేసింది. దీంతో స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా జనవరి 30 వరకు ప్రభుత్వం సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ కాస్త అదుపులోనే ఉండటం, విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడుతుండటంతో… విద్యాసంస్థల రీ ఓపెన్ కి విద్య, వైద్యశాఖ మొగ్గు చూపాయి. దీంతో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరుచుకోనున్నాయి అని ప్రకటించారు.

schools-reopen-in-telangana-state-from-february-1st

Advertisement

కాగా ఈ మేరకు రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే, ఇవి ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు స్కూళ్లు తెరవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తోంది.

Read Also : Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్‌ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel