...

CM Ys Jagan : ఏపీ తర్వాతి CS ఎవరు..? సీఎం జగన్ ఆ ఇద్దరిలో ఎవరిని అనుకుంటున్నారు..

CM Ys Jagan: ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది.1985 బ్యాచ్‌కు చెందిన సమీర్ 2021 జులైలో సెంట్రల్ సర్వీస్ నుంచి రిలీవ్ అయి స్టేట్ సర్వీసులో వచ్చారు. ఆయన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించే నాటికి రెండు నెలలు మాత్రమే సర్వీస్ కాలం మిగిలి ఉంది. అక్టోబర్‌లో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఈయన నవంబర్ చివరలో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉండగా.. జగన్ కోరుకుంటే మరో 6 నెలలు పాటు రెండు దఫాలుగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. ఇక సమీర్ తర్వాత ఎవరు తదుపరి ఏపీ సీఎస్ అని జోరుగా చర్చ నడుస్తోంది.

సీనియారిటీ ప్రకారం సీఎస్ రేసులో ముగ్గురు నుంచి నలుగురు ఐఏఎస్ కేడర్ అధికారులు జాబితాలో ఉన్నారు. వీరిలో గత సీఎస్ నీలం సాహ్నీ భర్త అజయ్ సాహ్నీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఏపీలో ఇద్దరు మహిళా ఐఏఎస్‌కు సీఎస్ పదవి వరించే అవకాశం లేకపోలేదని ఐఏఎస్ వర్గాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు తెలంగాణ కేడర్‌కు చెందిన వై శ్రీలక్ష్మి.. 1988 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారిణి తెలంగాణ నుంచి ఏపీకి రిలీవ్ అయ్యారు.

వెళ్లడంతోనే అక్కడ ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదా పొందారు. రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా కూడా ప్రమోషన్ వచ్చింది. ఎందుకంటే ఈమె ఓబులాపురం మైనింగ్, జగన్ కేసుల్లో సహ నిందితురాలిగా ఉండి జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ కారణంతోనే శ్రీలక్ష్మికి ఈ హోదా దక్కిందని అనుకుంటున్నారు. ఆమెకు సీఎస్ పదవి ఇవ్వాలంటే న్యాయపరమైన చిక్కులు తప్పక వచ్చే చాన్స్ ఉంది.

శ్రీలక్ష్మి నియామకానికి చిక్కులు ఎదురైతే మరో సీనియర్ అధికారిణి పూనం మాలకొండయ్యను సీఎస్‌గా నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈమె వ్యవసాయ శాఖ కమిషనర్‌గా ఉన్న టైంలో మోనోశాంటే వంటి మల్టినేషనల్ సంస్థకు వణకు పుట్టించారు. ఈ అధికారిణికి సీఎస్ బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలో అవినీతి తగ్గే అవకాశం ఉంటుందని సీఎం జగన్ భావిస్తే పూనం మాలకొండయ్య ఏపీ తర్వాతి సీఎస్‌గా కొనసాగుతారు.

Read Also : Ys Jagan : జగన్‌కు బిగ్ షాక్.. ‘కమ్మ’ కులంలో కదలిక మొదలైందా..?