...

Revanth Reddy : రేవంత్ నయా ప్లాన్.. 40 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం..?

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకుగాను ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు సరికొత్త ప్లాన్స్ వేసుకుంటున్నాయి. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో రాజకీయంగా టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకుగాను సిద్ధమవుతున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేందుకుగాను టీపీసీసీ చీఫ్ రేవంత్ సరికొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం. .

రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారం.. తెలంగాణలో ఈసారి 40 సీట్లు గెలుచుకోవాలనుకుంటున్నారట.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే సీనియర్ నేతలు..దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, జానారెడ్డి వంటి వారు కంపల్సరీగా గెలుస్తారని, ఈ క్రమంలోనే వారికి తోడుగా మరో 40 మంది కొత్త అభ్యర్థులను గెలిపించాలని రేవంత్ అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.

అదే క్రమంలో రేవంత్ రెడ్డి సొంత పార్టీలో ఉన్న నేతల కామెంట్స్‌ను కూడా పట్టించుకోకవడం లేదట. తనపై వస్తున్న విమర్శలను పక్కనబెట్టేసి పార్టీని బలోపేతం చేసేందుకుగాను ఫోకస్ పెట్టినట్టు పలువురు చెప్తున్నారు. అయితే, రేవంత్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కంటే కూడా తన సొంత ఇమేజీపైన ఆధారపడి పని చేస్తున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నింపిన రేవంత్ రెడ్డి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ పార్టీ కమిటీలను కూడా ప్రక్షాళన చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి రేవంత్ రెడ్డి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Read Also : RGV Comments : ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్స్.. టికెట్ల ధరలు తగ్గించే బదులు రాజమౌళికి రివార్డివ్వండి…