వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telangana Municipal Elections 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: మీ పోలింగ్ బూత్ ఎక్కడ? ఓటర్ స్లిప్ ఎలా పొందాలి?

By Ramesh Babu

Published on: February 11, 2026 8:35 AM

Updated on: February 11, 2026 10:43 AM

Follow Us

Telangana Municipal Elections 2026

---Advertisement---

  • తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
  • 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పురపాలక ఎన్నికలు
  • మొత్తంగా ఎన్నికల బరిలో 12,944 మంది అభ్యర్థులు పోటీ
  • ఒక్క కరీంనగర్‌లోనే అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది అభ్యర్థులు

Telangana Municipal Elections 2026 : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలను చేరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగనుంది. ఈరోజు బుధవారం (ఫిబ్రవరి 11)న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

ఈ సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 2,981 వార్డులకు పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తంగా 12,944 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

పురపోరులో 2225 మంది అభ్యర్థులు :
7 నగరపాలక సంస్థల్లో మొత్తం 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పుర పోరు బరిలో నిలిచారు. రాష్ట్రంలో ఒక్క కరీంనగర్‌లోనే అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది బరిలో నిలిచారు. 116 మున్సిపాలిటీల్లో 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్‌లో మాత్రం అత్యధికంగా 314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

రాష్ట్రంలో మొత్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 52 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటు వేసేంందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు.

Read Also : Success Story : దుబాయ్ రూ.1.1 కోట్ల ప్యాకేజీని వదిలి ఇండియాకు, సొంత బిజినెస్‌తో కోట్లలో ఆదాయం : ఆరోహి సక్సెస్ స్టోరీ

Telangana Voter List Check Online : మీ పేరు ఓటర్ లిస్ట్‌లో ఉందా?

మీ పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకున్నారా? అయితే ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓటర్, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డులను తమ వెంట తీసుకెళ్లాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఓటు వేసే వారంతా తమ ఓటర్ స్లిప్‌లను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ (Tr-Poll) మెబైల్ యాప్ ద్వారా పొందవచ్చునని తెలిపారు.

ఓటర్ స్లిప్ ఎలా పొందాలంటే?

  • అధికారిక ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
  • వోటర్ పోర్టల్ (Voter Portal) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఓటర్ స్లిప్ బై (Epic ID) అర్బన్ 2025 అనే డౌన్‌లోడ్ బటర్ క్లిక్ చేయండి.
  • కొత్త విండో‌ ఓపెన్ అవుతుంది. మీ పూర్తి వివరాలు ఎంటర్ చేసి ఓటర్ సిప్ల్ పొందండి.
  • మీ ఓటు ఏ వార్డు, ఏ పోలింగ్ కేంద్రం అనే వివరాలు చూడొచ్చు.
  • టీ-పోల్ (T-Poll) యాప్ లేదా 92400 21456 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఓటరు స్లిప్ పొందవచ్చు.

మరోవైపు.. పోలింగ్ పారదర్శకంగా జరిపేందుకు చర్యలను కట్టుదిట్టం చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రాల్లో అన్నిచోట్ల నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ అమలులోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సుమారు 41,773 మంది సిబ్బంది, 1,379 మంది రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.

, , , ,

Join our WhatsApp Channel