PM Kisan 20th Instalment : పీఎం కిసాన్ 20వ విడత ఇంకా మీ ఖాతాలోకి రాలేదా? ఇంటి నుంచి ఇలా చేస్తే రూ. 2వేలు వెంటనే పడతాయి!

PM Kisan 20th Instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత ఈ నెలలో విడుదల (PM Kisan 20th Instalment) అయింది. అయితే, మీ బ్యాంకు ఖాతాలోకి ఇంకా పీఎం కిసాన్ రూ. 2వేలు పడలేదా? అయితే, భయపడాల్సిన పనిలేదు. ఇలా చేయడం ద్వారా నిలిచిపోయిన వాయిదా తిరిగి పొందవచ్చు.

ఈ నెల ప్రారంభంలో ఆగస్టు 2, 2025న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి DBT ద్వారా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతను విడుదల చేశారు. అయితే, ఇంకా వేలాది మంది రైతులకు ఖాతాకు డబ్బు అందలేదు. వాయిదా తిరిగి పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

PM Kisan 20th Instalment : వాయిదా ఎందుకు నిలిచిపోతుందంటే? :

వాస్తవానికి, చాలా మంది రైతులు ఇ-కెవైసి పూర్తి చేయకపోవచ్చు. అందుకే వారి అందాల్సిన వాయిదాలు రావడం లేదు. కొంతమంది రైతుల ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ చేయడం లేదు. ఇది కాకుండా, భూమి ధృవీకరణ అసంపూర్ణంగా ఉండటం వల్ల వాయిదాలు కూడా నిలిచిపోతాయి. వాయిదాలు నిలిపివేసేందుకు అనేక ఇతర కారణాలు ఉన్నాయి.

Advertisement

Read Also : MG Windsor EV : కొంటే ఇలాంటి కారు కొనాలి.. జస్ట్ రూ. 2 లక్షల డౌన్‌పేమెంట్‌తో MG విండ్సర్ EV ఇంటికి తెచ్చుకోవచ్చు!

ఉదాహరణకు.. బ్యాంక్ వివరాలు లేదా పేరులో తప్పు, ఒకే ఫ్యామిలీ నుంచి ఒకరి కన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందుతుంటే కూడా వాయిదాలను కూడా నిలిపివేయవచ్చు. అదే సమయంలో, e-KYC లేకపోవడం వల్ల మీ డబ్బు నిలిచిపోయినట్లయితే మీరు ఈ కింది విధంగా ప్రయత్నించవచ్చు.

PM Kisan 20th Instalment : ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో e-KYC పూర్తి చేయండి :

మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటే.. e-KYC పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఇ-కేవైసీ లేకుండా పీఎం కిసాన్ డబ్బు విడుదల కావు. మీరు ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్ (https://pmkisan.gov.in)కి వెళ్లండి. ఆ తర్వాత హోమ్‌పేజీకి కుడి వైపున ఉన్న e-KYCపై క్లిక్ చేయండి. ఇక్కడ, మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. అదే ఎంటర్ చేయండి. e-KYC సక్సెస్ అయిందనే మెసేజ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Advertisement

e-KYC ఆన్‌లైన్‌లో చేయకపోతే ఏం చేయాలి? :

మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ కాలేదా? ఇందుకోసం మీరు సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీ e-KYC బయోమెట్రిక్స్ ద్వారా పూర్తి చేయొచ్చు. ఈ సమస్య ఇంకా అలానే ఉంటే మీరు కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-180-1551కు కాల్ చేయడం ద్వారా సాయం పొందవచ్చు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel