Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Ayushman Card : ఆయుష్మాన్ కార్డుతో ఏడాదికి ఒక్కసారి మాత్రమే చికిత్స తీసుకోవాలా? అసలు ప్రభుత్వ రూల్స్ ఇవే

Ayushman Card : ఆయుష్మాన్ కార్డు ద్వారా సంవత్సరానికి ఒకసారి మాత్రమే చికిత్స తీసుకోవాలా? చాలామందిలో ఇదే ప్రశ్న.. ఉచిత చికిత్సకు ప్రభుత్వ నిబంధనలేంటి? పరిమితులు, ఎవరికీ ఎంతవరకూ వర్తిస్తాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

By Vinod Kumar

Published on: February 9, 2026 6:30 AM

Updated on: February 9, 2026 12:54 AM

Ayushman Card Treatment Limited

---Advertisement---

  • ఏడాదికి రూ. 5 లక్షల వరకు మాత్రమే ఉచిత వైద్య బీమా పొందవచ్చు
  • ఒక ఏడాదికి ఒక్కసారే చికిత్స పొందాలి అనే పరిమితి లేదు
  • ఎవరైనా ఎన్నిసార్లు అయినా చికిత్స పొందవచ్చు
  • కార్డు వాడితే ఆ చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చే లెక్కలోకి వస్తుంది
  • పథకం కవరేజీ మొత్తం కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది
  • ప్రతి ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 తారీఖు) కొత్తగా రూ. 5 లక్షల కవరేజీ ఉంటుంది.

Ayushman Card : మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా? లేదంటే ఇప్పుడే అప్లయ్ చేసుకోండి.. ప్రస్తుతం దేశంలో ఆయుష్మాన్ భారత్ యోజన పథకం బాగా పాపులర్ అయింది. ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (PM-JAY) అని కూడా అంటారు.

దేశంలోని ప్రధాన ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలలో ఇదొకటి. అయితే, ఈ పథకానికి సంబంధించి నియమ నిబంధనల గురించి చాలామందికి అవగాహన లేదు. అందుకే పథకం పూర్తి ప్రయోజనాలను ఎలా పొందాలో తెలియక చాలా మంది గందరగోళంలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

Advertisement

Ayushman Card : ఏడాదికి ఒకసారి మాత్రమే ఆయుష్మాన్? :

అసలు ఆయుష్మాన్ కార్డుతో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ట్రీట్ మెంట్ పొందవచ్చా? అని చాలా మంది అడుగుతారు. చాలా మందిలో లబ్ధిదారుల్లో ఈ గందరగోళం కారణంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు.

ప్రభుత్వం అందించే ఈ పథకం ప్రధాన ముఖ్య ఉద్దేశం.. తీవ్రమైన అనారోగ్యం సమయంలో చికిత్స అందించడమే.. అందులో పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే.. అందుకే ఈ పథకం నియమాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి.

ఏ చికిత్స అయినా రూ. 5 లక్షల లోపే :

ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏడాదికి చికిత్సల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. ఒకసారి చికిత్స చేయించుకున్నాక మళ్లీ మరో చికత్సకు పనిచేయదా? అనే అనుమానం అక్కర్లేదు. ఎన్నిసార్లు అయినా ఎన్ని చికిత్సలకైనా వినియోగించుకోవచ్చు. అది కూడా రూ. 5 లక్షల పరిమితిలోపే ఉండాలి.

Read Also : Sukanya Samriddhi Yojana : ఆడపిల్ల ఉన్నవారికి ఇక అదృష్టమే.. ఈ SSY ప్రభుత్వ స్కీమ్‌తో డబ్బులే డబ్బులు.. చదువుకు, పెళ్లికి పనికివస్తాయి!

Advertisement

అవసరమైతే, లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఎంప్యానెల్ అయిన ఆస్పత్రిలో ఏడాదికి ఎన్నిసార్లు అయినా చికిత్స కోసమైనా వెళ్లొచ్చు. ఈ పథకం ఎన్నిసార్లు చికిత్స అనేది మాత్రమే కాదు.. మీ కవరేజ్ మొత్తం ఖర్చుకు లోబడి ఉంటుందని గమనించాలి.

ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద మీరు మొత్తం రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవర్ పొందవచ్చు. ఈ పథకం కింద మొత్తం చికిత్సకు అయ్యే ఖర్చు ఈ పరిమితిలోపు ఉన్నంత వరకు పథకం నుంచి పూర్తి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద మీరు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ పొందవచ్చు.

అన్ని అనారోగ్య సమస్యలకు వాడొచ్చు :

ఈ ప్రభుత్వ పథకం ప్రభుత్వ ఆస్పత్రులు, లిస్టెడ్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద అనేక రకాల తీవ్రమైన అనారోగ్యాలకు కూడా చికిత్స పొందవచ్చు. ప్రతి చికిత్సకు అందించే ఖర్చుపై మీ వార్షిక కవరేజ్ రూ. 5 లక్షల నుంచి చికిత్సను బట్టి కట్ అవుతూ వస్తుంది.

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ నుంచి ఎక్కువ మంది ప్రయోజనం పొందవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ కాలానుగుణంగా పరిధి, ఫీచర్లను విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భారత ప్రభుత్వం అందించే ఈ ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరుతున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు ఉచితంగా చికిత్సను అందుకుంటున్నారు.

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.