Kalvakuntla Kavitha : కేసీఆర్‌కు తిక్కుంది.. కానీ, దానికో లెక్కుంది.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తోందని ఆమె విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే అవినీతిపరులపై ఎందుకు ఐటీ దాడులు జరగడం లేదో చెప్పాలని సూటిగా కవిత ప్రశ్నించారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో కొట్లాడేందుకు సీఎం కేసీఆర్ ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఆమె చెప్పారు. కేంద్రంలోని బీజేపీ కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిందని, అందుకే తనపై అవినీతి ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. లిక్కర్ స్కాంలో అవినీతిలో తన పాత్ర ఏమాత్రం లేదని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేసీఆర్‌కి తిక్కుంది.. కానీ, దానికి కూడా ఓ లెక్క ఉందని కవిత అన్నారు. మా నాన్నంటే వాళ్లకు భయం పట్టుకుంది.

MLC Kalvakuntla Kavitha Strong Counter To BJP On Liquor Scam Allegations
MLC Kalvakuntla Kavitha Strong Counter To BJP On Liquor Scam Allegations

అందుకే సీఎం కేసీఆర్‌ ఈడీ, బోడీకి భయపడను అని అన్నారంటూ కవిత సమర్థించుకున్నారు. బీజేపీ కేసీఆర్‌పై రివేంజ్ తీర్చుకోవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్‌ అంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమేస్తుందని, ఆయన్ను ఏమి చేయలేక ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో లింక్ ఉందనే ఆరోపణలతో భయపెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. యుద్ధంలో రాజును ఓడించాలంటే ముందుగా అతడి సేనను దెబ్బకొడతారు.. తెలంగాణ విషయంలోనూ బీజేపీ అదే చేస్తోందని ఆమె అన్నారు.

Kalvakuntla Kavitha : బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టిన ఎమ్మెల్సీ కవిత.. 

బీజేపీ వ్యతిరేక పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం పరిపాటిగా చేసుకుందని కవిత దుయ్యబట్టారు. తెలంగాణలో నా వరకే కాదు.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎవర్ని వదిలిపెట్టడం లేదని అన్నారు. కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా, కన్యాకుమారిలో స్టాలిన్ కుటుంబంపైనా కేసులు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

Advertisement

తెలంగాణలో కేసీఆర్‌ అభివృద్ధి చేయలేదా అంటే.. తన తండ్రికి తిక్క ఉన్న మాట వాస్తవమేనని కవిత అంగీకరించారు. అందరికి ఉండే తిక్క కాదని, కేసీఆర్‌ తిక్కకు ఓ లెక్క ఉందని కౌంటర్ ఇచ్చారు కవిత. లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత పేరు వచ్చినా కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించగా.. కవిత తెలివిగా సమాధానమిచ్చారు. వాస్తవానికి లిక్కర్ కుంభకోణంలో వచ్చిన ఆరోపణలను ఎవరూ పట్టించుకోవద్దని తన కుటుంబ సభ్యులకు తానే చెప్పానంటూ కవిత స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పార్టీ నేతలంతా తనకు అండగా ఉన్నారని తెలిపారు. అయితే అవసరమైనప్పుడు కేసీఆర్, కేటీఆర్ బహిరంగంగా స్పందిస్తారని చెప్పారు.

Read Also : Viral Dance Video: కేటీఆర్ మెచ్చిన డ్యాన్స్.. ఆఫ్రికన్ చిన్నారులు అదరగొట్టారుగా

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel