Viral Dance Video: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంటుంది. దాని గురించి చాలా మందికి తెలియదు. తెలిసిన అతి కొద్ది మంది మాత్రం దానిని పదును పెడుతుంటారు. క్రమంగా ఆ ప్రతిభను పెంచుకుంటారు. ఒక లెవల్ వచ్చే సరికి అందులో రాటు దేలుతారు. అయితే మరికొందరికి తమ ట్యాలెంట్ ను చూపించడానికి సరైన వేదిక దొరకదు.
కానీ ఇప్పుడు రోజులు మారాయి. సరైన వేదిక కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎవర్నో ప్రాధేయపడాల్సిన అగత్యం అంతకన్నా లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మీ ప్రతిభకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే చాలు, మీలో నిజంగా టాలెంట్ ఉందని అనిపిస్తే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఫాలో అవుతారు. అలాంటి కొన్ని వీడియోలు అయితే రాత్రికి రాత్రే వారికి ఎక్కడ లేని ఫేమ్ తీసుకువస్తాయి.
This is Wow! Indian soft power. pic.twitter.com/DsGQWTsnF5
Advertisement— Aviator Anil Chopra (@Chopsyturvey) August 25, 2022
Advertisement
అచ్చంగా అలాగే కొంత మంది ఆఫ్రికన్ చిన్నారులు బాలీవుడ్ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. వారి స్టెప్పులతో ఒక ఊపు ఊపేశారు. సిద్దార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ నటించిన బార్ బార్ దేఖో సినిమాలో కాలా చష్మా పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ కుమ్మేశారు. తమ స్టెప్పులతో దుమ్ము లేపారు. భాష రాకపోయినా, భావం తెలియకపోయినా ఆ చిన్నారులు చేసిన డ్యాన్స్ అద్భుతంగా ఉంది. ఈ పిల్లల డ్యాన్స్ వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. చిన్నారులు అద్భుతంగా డ్యాన్స్ చేశారంటూ ప్రశంసలు కురిపించారు.