Manchu Vishnu : ఇద్దరు సీఎంలపై మా అధ్యక్షుడు విష్ణు సంచలన వ్యాఖ్యలు..

Manchu Vishnu : మా అధ్యక్షుడయిన మంచు విష్ణు ఇటీవలే తెలంగాణ పశుసంవర్థక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ… ప్రతాని రామకృష్ణా గౌడ్, గురురాజ్ ల కోసమే తాను ఈ విలేకరుల సమావేశానికి వచ్చినట్లు తెలిపారు. వారిద్దరూ తనకు మా ఎన్నికల సమయంలో ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. వారిపై తనకు అపారమైన నమ్మకం ఉందని తెలిపారు. ఇక కొంత మంది సినిమా స్టార్లు చేసే కామెంట్ల వలన సినిమా ఇండస్ట్రీ దెబ్బ తింటోదని ఆయన తెలిపారు. అందుకే మాట్లాడే ముందు అందరూ ఒక సారి ఆచి తూచి మాట్లాడాలని హితవు పలికారు.

లేకుంటే మనం సినిమా స్టార్లం కాబట్టి మన మాటలను మొత్తం ఇండస్ట్రీకి చెందినవిగా భావిస్తారని అప్పుడు ఇండస్ట్రీకి అందులో ఉన్న అమాయకులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తమ సొంత నిర్ణయాలని చెప్పుకుని ఏదైనా మాట్లాడుకోవచ్చునని తెలిపారు. ఇద్దరు సీఎంలు తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగు కోసం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మనం అద్దాల మేడల్లో ఉంటున్నామని కావున మనం ఒకరి మీదికి రాళ్లు వేసినా కానీ ఒకరు మనపై రాళ్లు వేసేలా మనం ప్రవర్తించినా కానీ మనకే నష్టం వస్తుందన్నారు. కావున సెలబ్రెటీలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇక విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేసిన మా ఎన్నికల సమయంలో రణరంగ వాతావరణం తలపించింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణ ప్యానెల్ ల మధ్య మాటల యుద్దాలతో పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసే వరకు కూడా పరిస్థితి వెళ్లింది.

Advertisement

Read Also : Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నతో ఈటలకు చెక్ పెట్ట బోతున్నరా..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel