...

AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం… ఏవంటే ?

AP New Districts : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రతిపాదనల నివేదికను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు అందించారు. ఏపీలో నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ మేరకు 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్త జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

15 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయగా… 30 రోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలుగు సంవత్సరాది ఉగాది లోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది.

అందుకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాత పేర్లను ప్రతిపాదించింది. కొత్త జిల్లాలుగా మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కాకినాడ, అన్నమయ్య, శ్రీబాలాజీ పేర్లను సూచించింది. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని అధికారులు స్పష్టం చేశారు.

  • పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా
  • పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా
  • అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా
  • కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా
  • అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా
  • ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా
  • విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లా
  • బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా
  • నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా
  • నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా
  • పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా
  • రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా
  • తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా

Read Also : AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దం…