Resume: మంచి ఉద్యోగం కోసం రెస్యూమ్ తయారు చేయండిలా.. ఫలితం మీదే?

Resume: సాధారణంగా మనం మన చదువులు పూర్తయిన తర్వాత ఉద్యోగ వేటలో పడతాము అయితే ఈ ఉద్యోగానికి మనం ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే సమయంలో పూర్తి వివరాలను సంబంధిత కంపెనీకి అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మనం ఒక రెస్యూమ్ తయారు చేసి మన వివరాలన్నింటినీ అందులో పొందుపరిచి సంబంధిత కంపెనీ లేదా ఆఫీసుకు మన వివరాలను పంపిస్తాము. అయితే రెస్యూమ్ తయారు చేసేటప్పుడు మన నైపుణ్యాన్ని పొందుపరిచినప్పుడే మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మనం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగానికి వెళుతున్న సమయంలో మన గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన వివరాలు అన్నీ కూడా అందులో పొందుపరచాలి. అదేవిధంగా మనం ఏదైనా స్పెషల్ కోర్స్ చేసి ఉంటే వాటిని కూడా రెస్యూమ్ లో పెట్టాలి. లేదు అప్పుడే మనం ఒకచోట విధులు నిర్వహించిన అనంతరం మరొకచోట ఉద్యోగానికి సంప్రదించినట్లయితే ముందుగా మనం చేసిన ఉద్యోగ వివరాలను పొందుపరచాలి.

ఈ విధంగా మునుపటి ఉద్యోగ వివరాలను పొందుపరచడమే కాకుండా, అక్కడ పని చేసిన విధంగా సర్టిఫికెట్లను కూడా జత చేయడం ఎంతో మంచిది.ఈ విధంగా మీరు ఉద్యోగం చేస్తున్న లేదా మీ చదువులు పూర్తి చేసిన ప్రతి ఒక్క విషయాన్ని రెస్యూమ్ లోపొందుపరచడం వల్ల మనకు మరికొంత ప్రయోజనకరంగా ఉండి వందల,వేల ఉద్యోగాలలో మనం ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మన రెస్యూమ్ లో మన గ్రాడ్యుయేషన్ కి మన ఉద్యోగ వివరాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరచడం ఎంతో మంచిది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel