Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Heart Blockage Symptoms : ఛాతీ నొప్పితో పాటు మీలో ఈ 4 లక్షణాలు ఉంటే హార్ట్ బ్లాక్‌కు సంకేతం కావొచ్చు

Heart Blockage Symptoms : మీకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా? మీకు ఛాతినొప్పితో పాటు ఈ 4 లక్షణాలు ఎప్పుడైనా కనిపించాయా? అయితే, అసలు ఆలస్యం చేయొద్దు.. వెంటనే వైద్యునికి చూపించుకోండి. మీ గుండె ప్రమాదంలో ఉందని గుర్తించండి..

By Ramesh Babu

Published on: February 10, 2026 5:03 AM

Updated on: February 10, 2026 10:13 PM

Heart Blockage Symptoms

---Advertisement---

  • గుండె సంబంధిత లక్షణాలు సాధారణంగానే కనిపిస్తాయి
  • గుండెకు రక్తాన్ని సరఫరా కాకుండా బ్లాకులు అడ్డుకుంటాయి
  • ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే అవి హార్ట్ బ్లాక్ సంకేతాలు కావొచ్చు
  • ఛాతి నుంచి నొప్పి మొదలై ఇలా ఇతర భాగాలకు పాకుతుంది

Heart Blockage Symptoms : మీ హార్ట్‌లో బ్లాక్ ఉందని తెలుసా? మీకు ఎప్పుడైనా ఇలాంటి లక్షణాల కనిపించాయా? అయితే, తస్మాత్ జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే మీ హార్ట్ లో బ్లాక్ ఉన్నట్టే.. ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండెపోటు మరణాలకు గురవుతున్నారు.

అయితే అనేక మంది ఈ గుండెపోటు సంకేతాలను సాధారణ నొప్పిగా భావించి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు మరణాలకు దారితీస్తున్నాయి. కొలెస్ట్రాల్, కొవ్వు వంటి పదార్థాలు ధమనులలో పేరుకుపోయిన సందర్భాల్లో హార్ట్ బ్లాక్ ఏర్పడుతుంది.

Advertisement

గుండెకు సరైన రక్త ప్రవాహాన్ని పంపడంలో అడ్డంకులు ఏర్పడతాయి. అప్పుడు ఛాతీ నొప్పి  (Heart Blockage Symptoms) వస్తుంటుంది. ఇది కేవలం మూములు నొప్పిగానే భావిస్తుంటారు. ఇది కేవలం గ్యాస్ నొప్పిగా భావిస్తారు. కానీ, ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారొచ్చు.

వైద్య నిపుణుల ప్రకారం.. గుండెపోటు లక్షణాలు ఛాతీ నొప్పికే పరిమితం కాదని గమనించాలి. మన శరీరం సూక్ష్మ సంకేతాల ద్వారా హెచ్చరికలను పంపుతుంది. మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడొచ్చు. భారీగా అలసట, పై శరీరంలో నొప్పి, ఛాతీ బరువుగా అనిపించడం ఉంటుంది.

Read Also : Ayushman Card : ఆయుష్మాన్ కార్డుతో ఏడాదికి ఒక్కసారి మాత్రమే చికిత్స తీసుకోవాలా? అసలు ప్రభుత్వ రూల్స్ ఇవే

మీ గుండె ధమనులలో తగినంత ఆక్సిజన్ అందడం లేదనే సంకేతం. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదిస్తే ఆకస్మిక గుండెపోటు నుంచి ప్రాణాలతో బయటపడొచ్చు. ఇంతకీ ఏయే లక్షణాలు ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Heart Blockage Symptoms : శ్వాస ఆడకపోవడం, తీవ్ర అలసట వార్నింగ్ :

గుండె ధమనులు మూసుకుపోవడం అసలైన లక్షణం. ఎలాంటి శారీరక శ్రమ లేకుండానే శ్వాస ఆడకపోవడాన్ని అసలు నిర్లక్ష్యం చేయొద్దు. ధమనులు ముడుచుకుపోయినప్పుడు శరీరమంతా రక్తాన్ని పంప్ చేసేందుకు గుండె అధికంగా కష్టపడాల్సి వస్తుంది.

అప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది. చిన్నపాటి పనుల తర్వాత కూడా చాలా అలసిపోయినట్లు అనిపిస్తే.. మీ అవయవాలకు తగినంత ఆక్సిజన్, రక్తం అందడం లేదని అర్థం చేసుకోవాలి. దీన్నే క్రానిక్ ఫెటీగ్ అని పిలుస్తారు.

నొప్పి ఇలా పాకుతుంది :

గుండెకు రక్తం సరఫరా ఆగిపోతుంది. గుండెకు వెళ్లే మార్గం మూసుకుపోతుంది అప్పుడు నొప్పి ఛాతీ మధ్యలో మాత్రమే ఉండదు. ఎడమ చేయి, భుజం, మెడ, దవడ వరకు పాకుతుంది. ఈ నొప్పి అకస్మాత్తుగా వస్తుంది.

కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. కానీ, విశ్రాంతి తర్వాత కూడా నొప్పి అలానే వస్తే వెంటనే ఎమర్జెన్సీ చికిత్స తీసుకోవడం మంచిది. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సాధారణ శరీర కండరాల ఒత్తిడిగా ఎప్పుడూ అనుకోవద్దు.

తలతిరగడం, చలి, చెమటలు పట్టడం :

మెదడుకు రక్త ప్రవాహం తగ్గినప్పుడు అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. వేడి, వ్యాయామం తర్వాత అకస్మాత్తుగా చలితో చెమట పట్టడం అసలైన లక్షణంగా గుర్తించాలి. మీ గుండె ఎక్కువగా ఒత్తిడికి గురవుతుందని ఇది సూచిస్తుంది. చాలామంది ఇది శారీరక బలహీనతగా పొరబడతారు. కానీ, గుండె జబ్బుల విషయంలో ఇది ముఖ్యమైన సంకేతం కావచ్చు. అందుకే అసలు అశ్రద్ధ చేయొద్దు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.