Diabetic Patients : వర్షాకాలం, శీతాకాలం, వేసవి ఇలా ఏ సీజన్ అయినా సరే.. లైఫ్ స్టయిల్ సరిగా లేకుంటే అనేక రోగాలు వస్తాయి. చిన్న పొరపాటు (Diabetic Patients) కూడా డయాబెటిస్ బాధితులకు ప్రాణాంతకం కావచ్చు. ఆరోగ్యకరమైన భోజనంతో పాటు, ఎప్పుడు తినాలి? అనేది కూడా అంతే ముఖ్యం.
చాలా మంది రాత్రి భోజనం ఆలస్యంగా తీసుకుంటారు. కానీ, సాయంత్రం 7 గంటల తర్వాత తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ వాళ్లు ఈ అలవాటు వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది.
నేటి బిజీ జీవితంలో అర్థరాత్రి భోజనం చేయడం కల్చర్ బాగా పెరిగిపోయింది. ఈ అలవాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆఫీసు నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చేవారికి లేదా ఎక్కువసేపు మొబైల్ వాడేవారికి ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. కానీ, నిద్ర, జీవక్రియ, రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతుంది. మీ భోజన సమయం విషయంలో తప్పక ఒక నిర్ణయం తీసుకోండి.
రాత్రిపూట జీర్ణశక్తి తక్కువ :
ఆయుర్వేదం ప్రకారం.. పగలు గడిచేకొద్దీ మన జీర్ణక్రియ బలహీనపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో రాత్రిపూట భారీ ఆహారం తీసుకుంటే.. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. శరీరంలో విషపదార్థాలు పెరుగుతాయి. ఈ విషపదార్థాలు కఫ దోషాన్ని పెంచుతాయి.
Diabetic Patients : డయాబెటిస్‌లో కఫ దోష ప్రభావం ఎక్కువ :
ఆయుర్వేదంలో డయాబెటిస్‌ను ‘మధుమేహం’ అని పిలుస్తారు. ప్రధానంగా కఫ దోషం వల్ల వస్తుంది. రాత్రిపూట ఆహారం తీసుకుంటే శరీరంలో కఫం పెరుగుతుంది. ఫలితంగా డయాబెటిస్ మరింత తీవ్రతరం అవుతుంది. డయాబెటిస్ ఉన్న వాళ్లు సమయానికి తేలికైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
Read Also : PM-KISAN 20th Instalment : పీఎం కిసాన్ 20వ విడత.. రైతుల బ్యాంకు ఖాతాలో ఈరోజు రూ. 2వేలు జమ అవుతాయా?..
రాత్రి భోజనం అసలు మిస్ చేయొద్దు..
రాత్రి భోజనం వద్దంటే అసలు మానేయొద్దు.. చాలామంది ఏదైనా కారణం వల్ల 7 గంటల వరకు భోజనం తీసుకోలేకపోతే.. ఆ రోజు రాత్రి భోజనం తినకుండా అలానే ఉంటారు. ఇలా చేయడం సరైన పని కాదు. ఆహారం మానేయడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర తగ్గుతుంది. దాంతో బలహీనత, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి. మీరు సూప్, కిచిడి లేదా ఉడికించిన కూరగాయలు వంటి తేలికైనవి ఆహారం తీసుకోవచ్చు.
Diabetic Patients : నిద్రపోయే ముందు భోజనం చేయొద్దు.. గ్యాప్ తప్పనిసరి :
రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. భోజనం చేసిన వెంటనే నిద్రపోయేవారి జీర్ణక్రియ మందగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. సాయంత్రం 7 గంటలకు తినడం అలవాటు చేసుకోవాలి. రాత్రి 10 గంటలకు నిద్రపోవాలి.
రాత్రిపూట తేలికపాటి ఆహారమే తీసుకోండి :
డయాబెటిక్ ఉన్నవారు రాత్రిపూట వేయించిన ఆహారాలు, స్వీట్లు, కార్బోహైడ్రేట్లు అతిగా తీసుకోకూడదు. పప్పు-కూరగాయలు తీసుకోవచ్చు. ఆకు కూరల సూప్ కూడా తీసుకోవచ్చు. తేలికైన ఆహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది.
డయాబెటిక్ బాధితులే కాదు.. ప్రతి ఒక్కరూ తొందరగా నైట్ డిన్నీర్ చేయాలి. తద్వారా నిద్ర బాగా పడుతుంది. ఊబకాయం రాదు. హార్మోన్ల బ్యాలెన్స్ అవుతాయి. గుండె ఆరోగ్యానికి, జీవక్రియకు కూడా చాలా మంచిది.
సరైన సమయంలో భోజనం చేయడం :
షుగర్ కంట్రోల్ చేసే ఔషధం కన్నా లైఫ్ స్టయిల్ మార్చుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట భోజన సమయాన్ని పాటించాలి. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. తగినంత నిద్రపోవాలి. తద్వారా షుగర్ లెవల్స్ నేచురల్‌గానే కంట్రోల్ చేయొచ్చు.
షుగర్ వ్యాధిగ్రస్తులు రాత్రి 7 గంటల తర్వాత తినాలా?
షుగర్ ఉన్నవారికి, రాత్రి 7 గంటల తర్వాత తినడం మంచిది కాదు. కానీ భోజన సమయం ముందుగా చేయాలి.
రాత్రి భోజనం తర్వాత రక్తంలో షుగర్ లెవల్ ఎంత ఉండాలి?
భోజనం తర్వాత (1 గంట నుంచి 2 గంటల తర్వాత) మీ రక్తంలో చక్కెర స్థాయి పెద్దలకు 180 mg/dL (10.0 mmol/L) కన్నా తక్కువగా ఉండాలి.