...
Telugu NewsEntertainmentRRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమాకు కశ్మీర్ ఫైల్స్‌తో ఇబ్బంది లేదు.. ఎలాగంటే!

RRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమాకు కశ్మీర్ ఫైల్స్‌తో ఇబ్బంది లేదు.. ఎలాగంటే!

RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా మార్చి 25వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి నటించిన ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా భారీ విజువల్ వండర్ గా జక్కన్న రూపొందించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇక ఆర్‌ఆర్ఆర్‌ సినిమా విడుదలకు ముందు ది కశ్మీర్‌ ఫైల్స్‌ అనే హిందీ సినిమా వల్ల టెన్షన్ పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్ ఆర్‌ ఆర్‌ కి రెండు వారాల ముందు అంటే రాధే శ్యామ్‌ విడుదలైన సమయంలో విడుదలైన ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. రెండు వందల కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా మరో వారం రోజుల పాటు సందడి చేస్తుంది అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. కానీ మూడవ వారంలో ది కాశ్మీర్ ఫైల్స్ సందడి ఉండకపోవచ్చు అంటూ ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రెండవ వారంలో సినిమా జోరు తగ్గింది.

Advertisement
rrr-movie-the-kashmir-files-effect-on-rrr-movie
rrr-movie-the-kashmir-files-effect-on-rrr-movie

వీకెండ్‌ లో కాస్త హడావిడి చేసినా వీక్‌ డేస్ నుంచి పూర్తిగా సినిమా డౌన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆర్‌ఆర్ఆర్ సినిమా కు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మరియు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా రాజమౌళి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అదృష్టం కొద్దీ రెండు వారాల ముందుగానే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల అయింది. ఒక వేళ మార్చి 25న ఆ సినిమా కూడా విడుదల అయితే కచ్చితంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కి చాలా పెద్ద డ్యామేజ్ ఉండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఆ సినిమాతో మన జక్కన్న సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

Advertisement

Read Also : RRR Movie: ఆర్ఆర్ఆర్ భయంతో ఇనుప మేకులు, కంచె ఏర్పాటు చేసుకున్న థియేటర్ ఓనర్స్..!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు