Car Buying Guide 2026 : ఈ ఫిబ్రవరిలో టయోటా కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. రూ.1.24 లక్షల వరకు ఆదా!

Car Buying Guide 2026 : టయోటా ఫిబ్రవరి 2026లో గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, టైసర్, క్యామ్రీ, హిలక్స్‌లపై ఎక్స్ఛేంజ్, లాయల్టీ, క్యాష్ డిస్కౌంట్లు, కార్పొరేట్ ఆఫర్‌లు, ఎక్స్ టెండెడ్ వారంటీలతో సహా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ SUVలపై సేవింగ్స్ రూ. 25,000 నుంచి రూ.1.24 లక్షల వరకు ఉంటాయి.

Car Buying Guide 2026 : టయోటా కారు లవర్స్ కోసం అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ ఫిబ్రవరి 2026లో గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, టైసర్, క్యామ్రీ, హిలక్స్ వంటి ఎంపిక చేసిన మోడళ్లపై అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది.

సంవత్సరాంతపు డిస్కౌంట్ పథకాల మాదిరిగా కాకుండా ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలను పొందవచ్చు. డీలర్‌షిప్, నగరాన్ని బట్టి లభ్యత, కచ్చితమైన బెనిఫిట్స్ మారవచ్చు.

టయోటా గ్లాంజా డిస్కౌంట్లు :
టయోటా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, గ్లాంజా పట్టణ కొనుగోలుదారులు, ఫస్ట్ టైమ్ కారు కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉంది. ఫిబ్రవరి నెలలో ఎంపిక చేసిన S, G, V వేరియంట్‌లపై రూ. 44,000 వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఇప్పటికే ఉన్న కస్టమర్లకు లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ ప్రోత్సాహకాలు ఉన్నాయి.

Advertisement

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ డిస్కౌంట్లు :
హైబ్రిడ్, నియోడ్రైవ్ పెట్రోల్, CNG వేరియంట్‌లకు హైరైడర్ అనేక ఆఫర్‌లను అందిస్తుంది. డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు, వెల్ కమ్ బోనస్‌లు, యాక్సెసరీ కిట్‌లతో సేవింగ్స్ రూ.80,000 వరకు చేరుతాయి. హైబ్రిడ్ వేరియంట్ అత్యంత ఆకర్షణీయమైన ఆప్షన్. ముఖ్యంగా హై మైలేజీని లక్ష్యంగా ఫ్యూయిల్ ఆదాతో పాటు ప్రమోషనల్ ఆఫర్ల నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : TVS Raider 125 Drum Review : మిడిల్ క్లాసు బైక్ అదుర్స్.. మీ బడ్జెట్ ధరలో స్పోర్ట్స్ బైక్.. ధర జస్ట్ ఎంతంటే?

టయోటా టైజర్ డిస్కౌంట్లు :
కాంపాక్ట్ క్రాస్ఓవర్ కేటగిరీలో టైసర్, మారుతి ఫ్రాంక్స్, టాటా పంచ్‌లతో పోటీపడుతుంది. ఫిబ్రవరిలో లభించే ప్రత్యేక బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్, లాయల్టీ ఆఫర్లు ఉన్నాయి. ఇందులో టర్బో వేరియంట్‌పై రూ. 25,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. సిటీ యూజర్లలో యువ కొనుగోలుదారులకు మోడల్‌ ఆకర్షణీయంగా ఉంటుంది.

Advertisement

టయోటా క్యామ్రీ డిస్కౌంట్లు :
ప్రీమియం కేటగిరీలో కామ్రీ హైబ్రిడ్ క్వాలిటీతో పాటు లగ్జరీ కార్లను కోరుకునే కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఫిబ్రవరి ఆఫర్లలో ఎక్స్ఛేంజ్, లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ పథకాలు, ఎక్స్ టెండెడ్ వారంటీ ప్యాకేజీలు ఉన్నాయి. మొత్తం సేవింగ్స్ రూ.1.24 లక్షల వరకు ఉండవచ్చు. లాంగ్ టైమ్ వారంటీ బెనిఫిట్స్ పొందవచ్చు.

టయోటా హిలక్స్ డిస్కౌంట్లు :
టయోటా హిలక్స్ పికప్ ఈ నెలలో అనేక అద్భుతమైన డిస్కౌంట్లను అందుకుంటోంది. డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు రూ. 1.10 లక్షల వరకు సేవింగ్స్ పొందవచ్చు.

Advertisement

Tufan9 Telugu Desk

Tufan9 Telugu Desk

Leading the Tufan9 editorial team, Tufan9 Telugu Desk uncovers stories that matter to you. From trending news to in-depth analysis, every report is crafted with care. Stay ahead of the headlines and discover news the way it’s meant to be read.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel