...

RRR Movie: కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ సినిమాని బాయ్‌కాట్ చేస్తామంటున్న కన్నడ ప్రేక్షకులు… కారణం అదేనా?

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక మరి కొన్ని గంటలలో నెరవేరబోతోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 25వ తేదీ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేడుకలను కూడా నిర్వహించారు. ఈ విధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.

kannada-audience-boycotting-rrr-movie-in-karnataka-is-that-the-reason
kannada-audience-boycotting-rrr-movie-in-karnataka-is-that-the-reason

ఇకపోతే ఈ నెల 19వ తేదీ చిక్బలాపూర్ లోఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు కన్నడ సినీ నటుడు శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివ రాజ్ కుమార్ కి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సరైన మర్యాద ఇవ్వలేదని కన్నడ ప్రేక్షకులు తీవ్రస్థాయిలో చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక తెలియజేస్తూ మాకు బిజినెస్ కన్నా మర్యాదనే ముఖ్యము. కన్నడ సినీ నటుడు శివ రాజ్ కుమార్ కు ఏ మాత్రం మర్యాద ఇవ్వలేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఈ సినిమాని కర్ణాటకలో పూర్తిగా బయకాట్ చేస్తున్నామని, ఈ సినిమాను ఎట్టి పరిస్థితులలో చూడము అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తనకు సరైన మర్యాద ఇవ్వకపోవడంతో కన్నడ ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : RRR Movie : దానయ్యకు దక్కేది అంతేనా?.. ఆర్ఆర్ఆర్ మెజారిటీ వాటా ఎవరికి ఎంతంటే?