RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా 550 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించాడు. ఈ సినిమా నిర్మాణ వ్యయం కరోనా వల్ల భారీగా పెరిగింది. ఆయినా కూడా ఖచ్చితంగా సినిమాకు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి పది రూపాయల చొప్పున లాభం వెనక్కు వస్తాయంటూ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు నమ్మకంతో ఉన్నారు.
ఇంతటి భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించిన నిర్మాత దానయ్య కు అంతకు మించి లాభాలు వస్తాయి అంటూ ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వందల కోట్ల లాభాలను దక్కించుకుంటాడు అని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆయనకు దక్కేది ఒక మోస్తరు మాత్రమే. లాభాల్లో చిన్న మొత్తం వాటా ఆయనకు దక్కబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్ పోయిన తర్వాత వచ్చిన లాభాల్లో దర్శకుడు హీరోలు మరియు నిర్మాత లకు వాటాలు వేస్తారట. ఆ వాటాలో చాలా చిన్న మొత్తం దానయ్య కు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజమౌళికి మెజారిటీ వాటా ఉంటుందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజమౌళి కంటే దానయ్యకి చాలా తక్కువ లాభం శాతం ఉంటుందని తెలుస్తోంది. ఉదాహరణకు సినిమా 100 కోట్ల లాభాలను దక్కించుకుంటే అందులో 15 నుంచి 20 కోట్లు మాత్రమే దానయ్య కు అంటూ సమాచారం అందుతుంది. అలా ఎన్ని వందల కోట్లు దక్కించుకున్నా కూడా లాభంలో దానయ్య వాట అంతే.
మెజారిటీ వాటాను రాజమౌళి తీసుకోబోతున్నాడు అనే సమాచారం అందుతోంది. ఇప్పటికే దానయ్య పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. ఇకపై వచ్చేది అంతా లాభమే.. వాటా చిన్నదే అయినా భారీగానే దానయ్య కు దక్కుతుంది. ఆయినా దానయ్య.. రాజమౌళి సినిమా ని నిర్మించడమే చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాడు. లాభాల విషయాన్ని ఆయన పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.
Read Also : RRR Movie: కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ సినిమాని బాయ్‌కాట్ చేస్తామంటున్న కన్నడ ప్రేక్షకులు… కారణం అదేనా?